Best Web Hosting Provider In India 2024
OTT Thriller Web Series: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈసారి దేశ చరిత్రలోనే అతి సుదీర్ఘ హైజాక్ గా చెప్పే కాందహార్ ప్లేన్ హైజాక్ పై సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ టీజర్ ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. విజయ్ వర్మ, అరవింద్ స్వామిలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓ లిమిటెడ్ సిరీస్ గా ఇది రానుంది.
ఐసీ 814: ది కాందహార్ హైజాక్
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా వస్తున్న ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ పేరు ఐసీ 814: ది కాందహార్ హైజాక్. ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది. అంతేకాదు ఓ ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న వారి ఫొటోలను మాత్రమే చూపిస్తూ ఎంతో ఆసక్తికరంగా సాగిందీ టీజర్.
ఈ వెబ్ సిరీస్ లో విజయ్ వర్మ ఐసీ 814 విమానం కెప్టెన్ శరణ్ దేవ్ గా నటించాడు. డిసెంబర్ 24, 1999లో జరిగిన ఆ భయానక హైజాక్ ఘటన గురించి అతడు వివరిస్తున్న వాయిస్ తో ఈ టీజర్ మొదలైంది. మన చరిత్రలోనే అదొక చీకటి రోజుగా నిలిచిపోయినట్లుగా ఇందులో చెప్పారు. ప్రముఖ నటి పత్రలేఖ ఈ సిరీస్ లో ఫ్లైట్ అటెండెంట్ ఇంద్రాణీగా నటించింది.
ఇది కేవలం ఒక్క విమానం హైజాక్ కాదు.. మొత్తం దేశం హైజాక్ అంటూ ఇందులో ఎడిటర్ షాలిని చంద్రగా నటించిన దియా మీర్జా చెబుతుంది. రా జాయింట్ సెక్రటరీ రంజన్ మిశ్రాగా నటుడు కుముద్ మిశ్రా కనిపించాడు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రాణాలను కాపాడటం ఒకెత్తయితే.. హైజాకర్లను డిమాండ్లను నెరవేర్చడం మరో సవాలు అని అతడు చెబుతాడు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ తమిళ నటుడు అరవింద్ స్వామి.. విదేశాంగ శాఖ సెక్రటరీ శివరామకృష్ణన్ పాత్రలో నటించాడు. తమ పోరాటం శత్రువులతోనే కాదు.. క్షణక్షణం గడిచిపోతున్న కాలంతోనూ అని అతడు అంటాడు. మొత్తంగా ఏడు రోజుల పాటు మొత్తం దేశాన్ని ఎంతో ఉత్కంఠకు గురి చేసిన కాందహార్ హైజాక్ జరిగిన తీరును ఈ వెబ్ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపబోతున్నట్లు ఈ టీజర్ తోనే స్పష్టమవుతోంది.
విజయ్ వర్మ, అరవింద్ స్వామి, పత్రలేఖ, కుముద్ మిశ్రా, నసీరుద్దీన్ షాలాంటి వాళ్లు నటించిన ఈ ఐసీ 814: ది కాందహార్ హైజాక్ లిమిటెడ్ వెబ్ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మీకు ఈ ఓటీటీ అకౌంట్ లేకపోతే.. వెంటనే నెలకు రూ.199 నుంచి మొదలయ్యే ప్లాన్స్ తో సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits