Visakha DSNLU Jobs : విశాఖ లా వర్సిటీలో 21 ఉద్యోగాలకు నోటిఫికేషన్, దరఖాస్తులకు ఆగస్టు 15 చివ‌రి తేదీ

Best Web Hosting Provider In India 2024


Visakha DSNLU Jobs : విశాఖ‌ప‌ట్నంలోని దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ (డీఎస్ఎన్ఎల్‌యూ)లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తులు దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేదీ ఆగ‌స్టు 15గా నిర్ణయించారు. ఇందులో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాలు

మొత్తం 21 పోస్టుల‌కు యూనివ‌ర్సిటీ నోటిఫికేష‌న్ విడుల చేసింది. టీచింగ్ పోస్టులు 16 పోస్టులు కాగా, ఐదు పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. టీచింగ్ పోస్టుల్లో ప్రొఫెస‌ర్ పోస్టులు 2, అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 3, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 4, టీచింగ్ అసోసియేట్ పోస్టులు 3, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 4, నాన్ టీచింగ్ పోస్టుల్లో అకౌంట్ ఆఫీస‌ర్ పోస్టు 1, ప‌ర్సనల్ సెక్రట‌రీ పోస్టు 1, అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టు 1, ఐపీఆర్ చైర్ ప్రొఫెస‌ర్ పోస్టు 1, రీసెర్చ్ అసిస్టెంట్స్ పోస్టు 1 ఉన్నాయి.

  • టీచింగ్ పోస్టుల‌కు అప్లై చేయాల‌నుకునే అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://dsnlu.ac.in/storage/2024/06/Application-form-Teaching-Posts.pdf క్లిక్ చేస్తే అప్లికేష‌న్ ఓపెన్ అవుతోంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • నాన్ టీచింగ్ పోస్టుల‌కు అప్లై చేయాల‌నుకునే అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://dsnlu.ac.in/storage/2024/06/Application-form-Non-Teaching-Posts.pdf క్లిక్ చేస్తే అప్లికేష‌న్ ఓపెన్ అవుతోంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఐపీఆర్ చైర్ ప్రొఫెస‌ర్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్‌ పోస్టుల‌కు అప్లై చేయాల‌నుకునే అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://dsnlu.ac.in/storage/2024/06/Application-Form-For-IPR.pdf

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్యర్థులకు రూ.2,000 కాగా, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగు అభ్యర్థులకు రూ.1,000 ఉంది. ది రిజిస్ట్రార్ దామోదరం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివర్సిటీ పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేయాల‌నుకునే అభ్యర్థులు ఆగ‌స్టు 15 తేదీ సాయంత్రం 5 గంట‌లపు అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

టీచింగ్ పోస్టులు

ప్రొఫెస‌ర్ పోస్టులు 2 ఉన్నాయి. అందులో ఒక‌టి ఎస్‌సీ (మ‌హిళ‌), ఒక‌టి ఓసీ కేట‌గిరీకి చెందిన‌వి. పే స్కేల్ రూ.1,44,200 నుంచి రూ.2,18,200 ఉంటుంది. మంచి రికార్డుతో పీహెచ్‌డీ చేసి ఉండాలి. యూజీసీ లిస్టెడ్ జ‌ర్నల్స్‌లో క‌నీసం ప‌ది రీసెర్చ్ ప‌బ్లికేష‌న్ చేసి ఉండాలి. క‌నీసం ప‌దేళ్ల అసెస్టింట్ ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, ప్రొఫెస‌ర్‌గా టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 3 ఉన్నాయి. అందులో ఒక‌టి ఎస్‌సీ (మ‌హిళ‌), ఒక‌టి ఓసీ, ఒక‌టి ఓసీ దివ్యాంగ (మ‌హిళ‌) కేట‌గిరీకి చెందినవి. పే స్కేల్ రూ.1,31,400 నుంచి రూ. 2,17,100 ఉంటుంది. మంచి అకాడ‌మిక్ రికార్డుతో పీహెచ్‌డీ చేసి ఉండాలి. మాస్టర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి. క‌నీసం ఎనిమిదేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి. యూజీసీ లిస్టెడ్ జ‌ర్నల్స్‌లో క‌నీసం ఏడు రీసెర్చ్ ప‌బ్లికేష‌న్ చేసి ఉండాలి.

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులు 4 ఉన్నాయి. అందులో ఒక‌టి ఎస్‌టీ (మ‌హిళ‌), ఒక‌టి ఓసీ, ఒక‌టి ఎస్‌సీ, ఒక‌టి బీసీ-ఏ (మ‌హిళ‌) కేట‌గిరీకి చెందినవి. పే స్కేల్ రూ.57,700 నుంచి రూ.1,82,400 ఉంటుంది. పీహెచ్‌డీ అవార్డు అయి ఉండాలి. మాస్ట‌ర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి. నెట్‌, సెట్‌, స్లెట్ క్లియ‌ర్ చేసి ఉండాలి. టీచింగ్ అసోసియేట్ పోస్టులు 3 ఉన్నాయి. అందులో ఒక‌టి ఓసీ (మ‌హిళ‌), ఒక‌టి ఎస్‌సీ (మ‌హిళ‌), ఒక‌టి ఓసీ కేట‌గిరీలో ఉన్నాయి. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. మంచి అకాడ‌మిక్ రికార్డు ఉండాలి. మాస్ట‌ర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి. రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. అందులో ఒక‌టి ఓసీ (మ‌హిళ‌), ఒక‌టి ఎస్‌సీ (మ‌హిళ‌), ఒక‌టి ఓసీ, ఒక‌టి బీసీ-ఏ (మ‌హిళ‌) కేట‌గిరీలో ఉన్నాయి. పే స్కేల్ రూ.37,640 నుంచి రూ.1,15,500 ఉంటుంది. మంచి అకాడ‌మిక్ రికార్డు ఉండాలి. మాస్ట‌ర్స్‌లో కనీసం 55 శాతం మార్కులు రావాలి.

నాన్ టీచింగ్ పోస్టులు

అకౌంట్ ఆఫీస‌ర్ పోస్టు 1 ఉంది. అది కూడా ఓసీ కేట‌గిరీకి చెందినది. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఫైనాన్స్‌లో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగుల‌కు 5 శాతం స‌డ‌లింపు ఉంది. క‌నీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ప‌ర్సనల్ సెక్రట‌రీ పోస్టు 1 ఉంది. అది కూడా ఎస్‌టీ మ‌హిళ కేట‌గిరీకి చెందిన‌ది. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. క‌నీసం 55 శాతం మార్కుల‌తో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగుల‌కు 5 శాతం స‌డ‌లింపు ఉంది. స్టెనోగ్ర‌ఫీ (హైయ్య‌ర్‌) అండ్ కంప్యూట‌ర్ స్కిల్స్ ఉండాలి. క‌నీసం మూడేళ్ల‌ అనుభవం ఉండాలి. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టు 1 ఉంది. అది కూడా ఓసీ కేట‌గిరీకి చెందిన‌ది. పే స్కేల్ రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది. క‌నీసం 55 శాతం మార్కుల‌తో మాస్టర్స్ చేసి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, దివ్యాంగుల‌కు 5 శాతం స‌డ‌లింపు ఉంది. క‌నీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

ఐపీఆర్ చైర్ ప్రొఫెస‌ర్ పోస్టు

మంచి ట్రాక్ రికార్డుతో అక‌డ‌మిక్ స్కాల‌ర్ అయి ఉండాలి. రిటైర్డ్ ఐపీ ఆఫీస‌ర్ అయి ఉండాలి. ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. ఐపీఆర్ ఫీల్డ్‌లో ప‌రిజ్ఞానం ఉండాలి. వ‌యో ప‌రిమితి 70 ఏళ్ల లోపు ఉండాలి. వేత‌నం నెల‌కు రూ.1 ల‌క్ష. ఐదేళ్లు ఉద్యోగం ఉంటుంది. కావాల‌నుకుంటే రెండేళ్లు పొడిగిస్తారు. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీ నియామకం చేస్తుంది. ప్రతి ఐపీఆర్ చైర్ ఇద్ద‌రు రీసెర్చ్ అసిస్టెంట్స్‌ను నియ‌మించుకోవ‌చ్చు. రీసెర్చ్ అసిస్టెంట్స్ వేత‌నం గ్రాడ్యూష‌న్‌ పూర్తి చేసిన వారికి రూ.30 వేలు, పీజీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన వారికి రూ.40 వేలు, పీహెచ్‌డీ వారికి రూ.50 వేలు ఉంటుంది.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం

టాపిక్

Ap JobsAndhra Pradesh NewsTrending ApTelugu NewsVisakhapatnam

Source / Credits

Best Web Hosting Provider In India 2024