Best Web Hosting Provider In India 2024
టాలీవుడ్ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ గత గురువారం (ఆగస్టు 8) జరిగింది. కాస్త హఠాత్తుగానే వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్‍మెంట్ తర్వాత శోభితపై బజ్ చాలా పెరిగిపోయింది. ఆమె పాపులారిటీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీంతో ఈ వారం ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల్లో శోభితా ధూళిపాళ్ల ట్రెండ్ అయ్యారు. ఈ లిస్టులో దూసుకెళ్లారు.
షారుఖ్‍ను దాటేసి..
ఐఎండీబీ పాపులర్ భారత సెలెబ్రిటీల ఈ వారం జాబితాలో శోభితా ధూళిపాళ్లకు రెండో స్థానం దక్కింది. బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ టాప్ ప్లేస్‍లో నిలిచారు. ముంజ్యా సినిమా సక్సెస్ తర్వాత శార్వరీ పాపులారిటీ బాగా పెరిగిపోయింది. చైతన్యతో ఎంగేజ్‍మెంట్ తర్వాత ప్రస్తుతం శోభిత టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. నేషనల్ వైడ్‍గా శోభిత గురించి చాలా మంది ఇంటర్నెట్‍లో వెతికేశారు. ఈ వారం ఐఎండీబీ లిస్టులో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ మూడో ప్లేస్‍లో నిలిచారు. దీంతో ఈ జాబితాలో షారుఖ్‍ను దాటేసి ఈ వారం రెండో స్థానంలో నిలిచారు శోభితా ధూళిపాళ్ల.
టాప్-10లో వీరు కూడా..
ఈ లిస్టులో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నాలుగు, ఐదు ప్లేస్‍ల్లో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రాణించిన యంగ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుట్ నటి దీపికా పదుకొణ్, మహారాజతో బ్లాక్‍బస్టర్ కొట్టిన తమిళ స్టార్ విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్యరాయ్ ఈ వారం టాప్-10లో నిలిచారు.
చైతూ – శోభిత ఎంగేజ్‍మెంట్
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీన జరిగింది. ముందుగా ప్రకటన లేకుండా ఈ వేడుకను అక్కినేని కుటుంబం నిర్వహించింది. 2021లో హీరోయిన్ సమంతతో విడిపోయారు చైతూ. ఆ తర్వాత 2022 నుంచి నాగచైతన్య, శోభిత డేటింగ్‍లో ఉన్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే, ఈ విషయంపై వారిద్దరూ మౌనం దాలుస్తూ వస్తున్నారు. గతేడాది లండన్ వెకేషన్‍కు ఇద్దరూ కలిసివెళ్లారు. అయితే, ఎట్టకేలకు ఈనెలలో ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు.
చైతూ, శోభిత ఎంగేజ్‍మెంట్‍కు ఇరు కుటుంబాల సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరినీ ఆహ్వానించలేదు. అయితే, నాగచైతన్య నిశ్చితార్థ వేడుకను ఎంత హడావుడిగా ఎందుకు నిర్వహించామన్నది ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పారు. ఆగస్టు 8వ తేదీన మంచి ముహూర్తం ఉండటంతో ఆరోజే హడావుడిగా ఎంగేజ్‍మెంట్ చేశామన్నారు. వారిద్దరి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని, అందుకే నిశ్చితార్థం చేసేశామని వెల్లడించారు.
నాగచైతన్య, సమంత కొన్నేళ్ల ప్రేమ తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే, 2021లో వారు విడిపోయారు. ఎంతో అన్యూన్యంగా కనిపించిన వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు శోభితను వివాహం చేసుకోనున్నారు చైతూ. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య డిప్రెషన్‍లో వెళ్లారని నాగార్జున ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. శోభిత రావటంతో అతడి ముఖంలో నవ్వు మళ్లీ తిరిగి వచ్చిందని అన్నారు.
నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటీ దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. శోభిత ప్రస్తుతం బాలీవుడ్‍లో సితార చిత్రంలో నటిస్తున్నారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits