Sangareddy Theft: సంగారెడ్డిలో పట్టపగలే చోరీ,స్వీట్ షాప్ కి వెళ్ళొచ్చేలోపే కారులో రూ.10 లక్షలు మాయం

Best Web Hosting Provider In India 2024


Sangareddy Theft: తండ్రి కొడుకులు కలిసి బ్యాంకు లో డబ్బు డ్రా చేసుకొని వస్తూ మార్గమధ్యలో స్వీట్స్ కొనడానికి ఒక షాప్ లోకి వెళ్ళారు. వారు షాప్ లోకి వెళ్ళొచ్చేలోపే నిమిషాల వ్యవధిలోనే కారులో ఉన్న రూ. 10 లక్షలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది. పట్టపగలే చోరీ జరగడం స్థానికంగా సంచలనం రేపింది.

 

అద్దాలు పగలగొట్టి డబ్బు బ్యాగుతో ఉడాయించారు…

సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆగి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు రూ. 10 లక్షల నగదు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జోగిపేటకు చెందిన రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి రవీందర్ రెడ్డి, ఆయన కుమారుడు సాయి కిరణ్ రెడ్డి తో కలిసి సోమవారం, స్థానిక ఎస్‌బిఐ బ్యాంకు బ్రాంచ్‌లో తమ అకౌంట్ నుండి పది లక్షల రూపాయలను చెక్కు ద్వారా డ్రా చేసుకున్నారు.

 

డ్రా చేసుకున్న సొమ్మును ఒక బ్యాగ్లో పెట్టి, కారు ముందు సీట్లో పెట్టారు. తర్వాత అక్కడి నుండి, తండ్రికొడుకులు ఇద్దరు కారులో బయల్దేరారు . అక్కడి నుండి నాందేడ్ – అకోలా ప్రధాన రహదారిపై ఉన్న జోగిపేట పోలీస్ స్టేషన్ ప్రధాన గేటు ఎదురుగా కారు పార్క్ చేసి స్వీట్ కొనేందుకు ఒక దుకాణంలోకి వెళ్ళారు.

 

నిమిషాల వ్యవధిలోనే ….

స్వీట్ బాక్స్ తీసుకొని కారు దగ్గరకి వచ్చేసరికి, కారు అద్దాలు పగలగొట్టి ఉండటంతో రవీందర్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి షాక్ తిన్నారు. కారు లోపల వెతకగా ఎక్కడకు, డబ్బుల బ్యాగు కనపడలేదు. నిమిషాల వ్యవధిలోనే ఎవరో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి పది లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో రవీందర్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అనిల్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి బ్యాంకుకు చేరుకొని బ్యాంకులో సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితుడు రవీందర్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

 

బ్యాంకు దగ్గర నుండి బాధితులను ఫాలో అయ్యారు…

బ్యాంకు వచ్చేవారిని దోచుకోవదాటనికి, ఇప్పటినుండే అక్కడ వేచిఉన్న కేటుగాళ్లు పనే ఈ దొంగతనమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు దగ్గర నుండి, రవీందర్ రెడ్డి కారుని దొంగలు బైక్ పైన ఫాలో అయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే డబ్బులు దొంగిలించిన తర్వాత, దొంగలు ఎటువైపు వెళ్లారని విషయాన్నీ పోలీసులు సీసీ కెమెరా లో ట్రాక్ చేస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ఆశాబావం వ్యక్తం చేసారు. అయితే బ్యాంకు వచ్చిన ఖాతాదారులు అందరు కూడా ఎంతో జాగురూకతలో ఉండాలని ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

 

టాపిక్

Telugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsSangareddyCrime News

Source / Credits

Best Web Hosting Provider In India 2024