OTT Hollywood Action Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024


OTT Hollywood Action Movie: హాలీవుడ్ లో రెండు నెలల కిందట రిలీజై ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 9వ స్థానంలో నిలిచిన బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతోంది. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ యాక్షన్ కామెడీ మూవీ రిలీజైంది. ఇందులో స్టార్ హీరో విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ కలిసి నటించారు.

బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై ఓటీటీ రిలీజ్ డేట్

హాలీవుడ్ లో సుమారు 10 కోట్ల డాలర్ల బడ్జెట్ తెరకెక్కిన మూవీ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 40 కోట్ల డాలర్లు వసూలు చేసింది. బ్యాడ్ బాయ్స్ సిరీస్ లో నాలుగో సినిమాగా వచ్చింది. 2020లో వచ్చిన బ్యాడ్ బాయ్స్ ఆఫ్ లైఫ్ మూవీకి ఇది సీక్వెల్. ఆదిల్, బిలాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇప్పుడీ మూవీ సెప్టెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

నిజానికి కొన్నాళ్ల కిందటి నుంచే ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీల్లో ఈ బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై మూవీ రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లందరూ సెప్టెంబర్ 6 నుంచి ఈ సినిమా చూడొచ్చు. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ డిటెక్టివ్ పాత్రల్లో కనిపించే మూవీ ఇది.

బ్యాడ్ బాయ్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన ఈ మూవీలో మియామీ డిటెక్టివ్స్ అయిన మైక్ లౌరీ, మార్కస్ బర్నెట్.. తమ దివంగత కెప్టెన్ కాన్రాడ్ హోవర్డ్ పై మోపిన తప్పుడు కుట్ర కేసును ఛేదించే పనిలో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 40 కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన 9వ మూవీగా నిలిచింది.

బ్యాడ్ బాయ్స్ ఫ్రాంఛైజీ

బ్యాడ్ బాయ్స్ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఐదో మూవీ కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో సినిమా చేయడానికి విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ సుముఖంగా ఉన్నారు. తమ ఫ్రాంఛైజీకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ వల్ల తాము మరో మూవీ చేయాలని నిర్ణయించినట్లు లారెన్స్ చెప్పాడు.

ఈ ఫ్రాంఛైజీ నుంచి తొలిసారి 1995లో బ్యాడ్ బాయ్స్ మూవీ వచ్చింది. ఆ తర్వాత 2003లో బ్యాడ్ బాయ్స్ 2 పేరుతో సీక్వెల్ తీసుకొచ్చారు. మళ్లీ 17 ఏళ్లకు అంటే 2020లో బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్, ఈ ఏడాది బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై మూవీస్ వచ్చాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024