Penis Infection: పురుషాంగంలో ఇన్ఫెక్షన్‌ వస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఈ ఇంటి చిట్కాలతో నయం

Best Web Hosting Provider In India 2024


జననాంగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు కేవలం మహిళల్లోనే కాదూ.. పురుషుల్లోనూ ఉంటాయి. పురుషుల్లోనూ యీస్ట్ ఇన్ఫెక్షన్ సమస్య చాలా మందికి వస్తుంది. కానీ దీని గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడి సమస్య తీవ్రంగా మార్చుకుంటారు. ఒకరకమైన ఫంగస్ వల్ల యీస్ట్ ఇన్ఫెక్షన్ పురుషాంగాల్లో వస్తుంది.

యీస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు:

క్యాండిడా యీస్ట్ ఆరోగ్యకరమైన స్థాయుల్లో మహిళల్లో, పురుషుల్లోనూ సాధారణంగా ఉంటుంది. కానీ దీని స్థాయి పెరిగితే ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. దీని లక్షణాలు:

మూత్రానికి వెళ్లినప్పుడు మంట

సెక్స్ సమయంలో అసౌకర్యం

పురుషాంగం మొదట్లో ఎరుపెక్కడం, దురద

దుర్వాసన రావడం

పురుషాంగం చుట్టూ దురద

పురుషాంగం మీద చర్మం తెలుపు రంగులో పొలుసులుగా మారడం

ఇన్ఫెక్షన్ కారణాలు:

శుభ్రత పాటించకపోవడం

డయాబెటిస్

కొన్ని రకాల యాంటీ బయాటిక్స్ వాడకం

అధిక బరువు 

నప్పని కాండోమ్స్ వాడటం

బిగుతు లోదుస్తులు వాడటం

ఇన్ఫెక్షన్ ఉన్న మహిళతో శృంగారంలో పాల్గొనడం

.. సాధారణ కారణాలివే.

పురుషాంగంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ తగ్గించే చిట్కాలు:

1. యోగర్ట్:

పెరుగు లేదా యోగర్ట్ అనేవి సహజ ప్రొబయాటిక్ ఆహారాలు. ఆహారంలో పెరుగును ఎక్కువగా చేర్చుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. క్యాండిడా లాంటి ఇన్ఫెక్షన్లను పోరాడటంలో సాయపడుతుంది. సమస్య ఉన్న ప్రాంతంలో పెరుగును కొద్దిగా రాసుకున్నా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. స్వచ్ఛమైన పెరుగును వాడటం ముఖ్యం. 

2. వెల్లుల్లి:

వెల్లుల్లికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెల్లుల్లిని ఆహారంలో వీలైనంత ఎక్కువగా చేర్చుకోవాలి. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల ఎక్కువ  లాభాలు పొందొచ్చు. అలాగే వెల్లుల్లి, థైమ్ ఉన్న యాంటీ ఫంగల్ క్రీములు వాడటం వల్ల ప్రయోజనాలు తొందరగా పొందొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. 

3. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెకు అనేక లక్షణాలున్నాయి. చర్మానికి తేమ అందించి దురద తగ్గిస్తుంది. దీనికున్న యంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాసుకుంటే సమస్య తగ్గుతుంది. 

4. టీ ట్రీ నూనె:

టీ ట్రీ నూనె ఒక రకమైన ఎసెన్షియల్ నూనె. దీనికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలున్నాయి. పురుషాంగానికి సమస్య ఉన్న చోట టీట్రీ ఆయిల్ రాసుకుంటే ఉపశమనం ఉంటుంది. అయితే ఈ నూనె అనేక గాఢత రకాల్లో దొరుకుతుంది. ఎక్కువ గాఢత ఉన్న స్వచ్ఛమైన టీట్రీ ఆయిల్ నేరుగా వాడకూడదు. కొబ్బరి లేదా ఆలివ్ నూనె లాంటి క్యారియర్ ఆయిల్‌లో కలిపి సమస్య ఉన్నచోట రాసుకోవాలి. 

5. యాపిల్ సిడార్ వెనిగర్:

దీని వాసన కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. కానీ దీన్ని సమస్య ఉన్నచోట యాపిల్ సిడార్ వెనిగర్ రాసుకుంటే ఫలితం ఉంటుంది. నీళ్లలో సమపాళ్లలో కలిపి రాసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. 

ఈ చిట్కాలు సమస్య తక్కువగా ఉన్నప్పుడు సత్వర ఫలితాల కోసం వాడొచ్చు. భరించలేనంత దురద, మంట , ఇంకేమైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ తగ్గించే యాంటీ ఫంగల్ క్రీములతో సమస్య తొందరగా తగ్గిపోతుంది. 

Source / Credits

Best Web Hosting Provider In India 2024