Best Web Hosting Provider In India 2024

TG Employee Relieved : ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్థానికత కలిగి ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణ పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం, ఉద్యోగుల అభ్యర్థనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రీలీవ్ చేసిన ఉద్యోగులు తమ కేడర్ చివరి ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
టాపిక్
Telangana NewsTelugu NewsAndhra Pradesh NewsAmaravatiHyderabadAp Govt