Donald Trump Elon Musk : ‘హత్యాయత్నం తర్వాత దేవుడి మీద నమ్మకం పెరిగింది’- డొనాల్డ్​ ట్రంప్​

Best Web Hosting Provider In India 2024


తనపై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి తాను దేవుడిని మరింత నమ్మడం మొదలుపెట్టినట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికెన్​ పార్టీ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. అక్రమ వలసలే తనను కాపాడాయని పేర్కొన్నారు. ఈ మేరకు.. దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్​తో ఎక్స్​లో జరిగిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా తీవ్ర సాంకేతిక లోపం కారణంగా ఈ ఇంటర్వ్యూ 40 నిమిషాలపై ఆలస్యమైంది. సాంకేతిక లోపాన్ని సైబర్​ దాడిగా మస్క్​ అభివర్ణించారు.

ట్రంప్​తో మస్క్​ చాట్​..

గత నెలలో పెన్సిల్వేనియా ర్యాలీలో డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తన ఇంటర్వ్యూలో ఎలాన్​ మస్క్​ ప్రస్తావించారు.

తనపై జరిగిన హత్యాయత్నం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘నా దగ్గర అంత రక్తం ఉందని నాకు తెలియదు! అదే సమయంలో నేను తీవ్రంగా గాయపడలేదు కాబట్టి ఈ విధంగా ఆలోచించడం ఉత్తమం,’ అని ట్రంప్​ అన్నారు.

“ఇప్పుడు నేను విశ్వాసిని. నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతున్నాను,’ అని ట్రంప్ అన్నారు.

ఇమ్మిగ్రేషన్ విషయంలో తన వైఖరి కారణంగానే తనను టార్గెట్ చేశారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

జులై 13న హత్యాయత్నం నుంచి బయటపడిన పెన్సిల్వేనియాలోని బట్లర్​కు అక్టోబర్​లో తిరిగి వెళ్తానని మస్క్​తో ట్రంప్ చెప్పారను.

కాల్పులు జరగడానికి కొన్ని క్షణాల ముందు ట్రంప్ తన పొజిషనింగ్​ను సర్దుబాటు చేసుకోవడానికి ప్రేరేపించిన చార్ట్​లు తన ప్రాణాలను కాపాడాయని మస్క్ అన్నారు.

“మీ ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను,’ అని మస్క్ అన్నారు.

‘అక్రమ వలసలు నా ప్రాణాలను కాపాడాయి,’ అంటూ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు.

కమలా హారిస్​ ఫేక్​.. 

ఈ ఇంటర్వ్యూలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ట్రంప్​. “నేను చేసిన ప్రతి పనిని ఆమె చేస్తోంది,” అని పేర్కొన్నారు. ఆమె ఫేక్ అని, ఆమె కనుసన్నల్లోనే సరిహద్దులు దాటుతున్న అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని పునరుద్ఘాటించారు.

ట్రంప్​- ఎలాన్​ మస్క్​ చాట్​పై సైబర్​ దాడి..?

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ  ఎక్స్​లో సాంకేతిక లోపాల కారణంగా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూకు పద్దెనిమిది నిమిషాల ముందు, మస్క్ ఎక్స్​లో భారీ డినయల్​ ఆఫ్​ సర్వీస్​ అటాక్ (డీడీఓఎస్)ను ఎదుర్కొంటున్నట్టు పోస్ట్ చేశారు. ఒక సైట్​ని పనిచేయనివ్వకుండా చేసేందుకు డేటాతో దానిని ఫ్లడ్​ చేయడం నేరం అని మస్క్​ తెలిపారు.

డొనాల్డ్​ ట్రంప్​ ఎలాన్​ మస్క్​ ఇంటర్వ్యూ కోసం లక్షలాది మంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఇంటర్వ్యూ ప్రారంభ సమయానికి వారు దానిని చూడలేకపోయారు. టెక్నికల్​ గ్లిచ్​ మెసేజ్​లు వచ్చాయి. ఫలితంగా మస్క్​ ఇంటర్వ్యూని ఆపేయాల్సి వచ్చింది.ధృవీకరించలేదు.

ఎక్స్ సర్వర్లలో భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ అటాక్ (డీడీఓఎస్)’ జరగడమే ఆలస్యానికి కారణమని ఎలన్ మస్క్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ చెప్పేది వినేందుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి ఈ సైబర్ దాడి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ట్రంప్-మస్క్ ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది శ్రోతలను ఆకర్షించగలిగింది. ఎలాన్ మస్క్​ను అభినందించిన ట్రంప్ .. ‘మీరు రికార్డులు బద్దలు కొట్టారు. పుస్తకంలోని ప్రతి రికార్డును బద్దలు కొట్టినందుకు అభినందనలు,” అని అన్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link