Best Web Hosting Provider In India 2024

దేవర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. దేవరతోనే టాలీవుడ్‍లోకి సైఫ్ ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘భైర’ పాత్ర చేస్తున్నారు. నేడు (ఆగస్టు 16) సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కావటంతో గ్లింప్స్ రిలీజ్ చేసింది దేవర మూవీ టీమ్. భైర గ్లింప్స్ అంటూ ఓ వీడియో తీసుకొచ్చింది.
గ్లింప్స్ ఇలా..
దేవర నుంచి వచ్చిన భైర గ్లింప్స్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‍గా ఉంది. మల్లయోధుడిగా సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్‍గా, భీకరంగా కనిపించారు. ముందుగా ఆ ప్రాంతమంతా భైర (సైఫ్ అలీఖాన్) కనుసన్నల్లోనే ఉంటుందనేలా మేకర్స్ ఈ గ్లింప్స్‌లో చూపించారు. అక్కడి వారు భైర.. భైర అని అరుస్తుండగా.. అతడు మల్లయుద్ధానికి దిగుతాడు. పోటీకి వారిని మట్టికరిపిస్తాడు. అతడికి ఓ సైన్యమే ఉంటుందని ఈ గ్లింప్స్‌లో అర్థమవుతోంది.
మొత్తంగా దేవరలో సైఫ్ అలీ ఖాన్ బలమైన విలన్‍గా ఉంటాడనేది అర్థమవుతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. విలన్ ఎంత పటిష్టంగా ఉంటే.. హీరో అంత ఎలివేట్ అవుతాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్లింప్స్‌కు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ అయింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits