Mr Bachchan: విమర్శలతో మిస్టర్ బచ్చన్ టీమ్ కీలక నిర్ణయం.. రన్‍టైమ్‍లో కోత.. ఎన్ని నిమిషాలు కట్ చేశారంటే..

Best Web Hosting Provider In India 2024


హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ప్రమోషన్లతో పాటు హరీశ్ శంకర్ కామెంట్లతో బాగా హైప్ వచ్చేసింది. పాటలు ఆకట్టుకోవడం, ట్రైలర్ బాగుండటంతో అంచనాలు పెరిగాయి. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ బుధవారం (ఆగస్టు 14) సాయంత్రమే ప్రీమియర్ల షోలతో ఈ చిత్రం రాగా.. గురువారం పూర్తిస్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రీమియర్ల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో ముఖ్యంగా అనవసరమైన సీన్లు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలీవుడ్ మూవీ రైడ్‍కు రీమేక్‍గా ఈ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు. అయితే, బోలెడు మార్పులు చేశారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా తీర్చిదిద్దారు. అయితే, మిస్టర్ బచ్చన్‍కు తీవ్రంగా మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ టీమ్ నేడు (ఆగస్టు 16) కీలక నిర్ణయం తీసుకుంది. రన్‍టైమ్ తగ్గించేసింది.

13 నిమిషాలు కట్

మిస్టర్ బచ్చన్ సినిమాకు వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే 13 నిమిషాల రన్‍టైమ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. ముందుగా 2 గంటల 38 నిమిషాల రన్‍టైమ్‍తో మిస్టర్ బచ్చన్ మూవీ వచ్చింది. అందులో ఇప్పుడు 13 నిమిషాలు కట్ కానుంది.

మిస్టర్ బచ్చన్ మరింత రేసీగా ఉంటుందని ఈ మూవీని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేడు ట్వీట్ చేసింది. “విమర్శలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 13 నిమిషాలు ఈ చిత్రాన్ని ట్రిమ్ చేసేశాం. మరింత రేసీగా, ఎంగేజింగ్‍గా మార్చాం” అని పోస్ట్ చేసింది.

మిస్టర్ బచ్చన్ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. రెండో రోజు వసూళ్లలో డ్రాప్ ఉండొచ్చని ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.

ఫలించేనా!

మిస్టర్ బచ్చన్ సినిమాకు మిక్స్డ్ టాక్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఆ ప్రభావం రెండో రోజు స్పష్టంగా కనిపించింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. మరోవైపు, పోటీగా ఉన్న ఇస్మార్ట్ శంకర్ మూవీకి కూడా మిక్స్డ్ టాకే రావటంతో మిస్టర్ బచ్చన్ టీమ్ ఇంకా ఆశతోనే ఉంది. అందుకే రన్‍టైమ్ కట్ చేసే స్ట్రాటజీని ఎంచుకుంది. మరి ఇది ఫలించి వీకెండ్‍లో కలెక్షన్లు జోరందుకుంటాయనే ఆశిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

తన సినిమాలకు ఆరంభంలో మిక్స్డ్ టాక్ సాధారణమేనని, మిస్టర్ బచ్చన్ మూవీకి టాక్ మారుతోందని హరీశ్ శంకర్ అన్నారు. తమ అంచనాల మేరకే మూవీ ఆడుతోందని అన్నారు. సక్సెస్ మీట్‍ను కూడా గురువారమే నిర్వహించింది మూవీ టీమ్.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటించారు. డ్యాన్సులతో దుమ్మురేపారు. అయితే, సితార సాంగ్‍లో ఓ డ్యాన్స్ మూవ్‍మెంట్‍పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీంతో పాటలో ఓ ఫ్లోలో ఆ స్టెప్ వచ్చిందని, స్క్రీన్‍ షాట్లు తీసి చూస్తే అభ్యంతరకరంగా ఉండొచ్చంటూ హరీశ్ శంకర్ వివరణ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ఎదురుచెప్పలేక ఆ స్టెప్‍ను తాను తిరస్కరించలేదని అన్నారు.

మిస్టర్ బచ్చన్ మూవీలో జగపతి బాబు విలన్‍గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి మిక్కీజే మేయర్ సంగీతం అందించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024