Survival Thriller OTT: తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండ‌దు!

Best Web Hosting Provider In India 2024


Survival Thriller OTT: మ‌ల‌యాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ న‌ల్ల నిళ‌వుల రాత్రి తెలుగులోకి వ‌చ్చింది. కాళ‌రాత్రి పేరుతో నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. శ‌నివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ల‌యాళంలో రిలీజైన ఫ‌స్ట్ స్లాష‌ర్ హార‌ర్ మూవీగా న‌ల్ల నిళ‌వుల‌ రాత్రి నిలిచింది. మ‌ర్ఫీ డేవ‌సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో చెంబ‌న్ వినోద్ జోస్‌, బాబురాజ్‌, సాయికుమార్‌, జీను జోసెస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. హీరోయిన్ లేకుండా అంద‌రూ మేల్ క్యారెక్ట‌ర్స్‌తోనే ద‌ర్శ‌కుడు ప్ర‌యోగాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించాడు.

 

మిక్స్‌డ్ టాక్‌…

మ‌ల‌యాళంలో గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన న‌ళ్ల నిళ‌వుల రాత్రి మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. కాన్సెప్ట్‌, ప్ర‌ధాన పాత్ర‌ధారుల యాక్టింగ్ బాగున్నా….ద‌ర్శ‌కుడి ప్ర‌జెంటేష‌న్‌, టేకింగ్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. మంచి పాయింట్‌ను డైరెక్ట‌ర్ స‌రిగా తెర‌పై ఆవిష్క‌రించ‌లేక‌పోయాడంటూ కామెంట్స్ వినిపించాయి.

 

ఆరుగురు స్నేహితుల క‌థ‌…

ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్‌ను డెవ‌ల‌ప్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఆరుగురు స్నేహితులు ఓ అట‌వీ ప్రాంతానికి వ‌స్తారు. తాము ముందుగా బుక్ చేసుకున్న రిసార్ట్ కాకుండా అనుకోకుండా పాడుబ‌డ్డ బంగ‌ళాలో వారు ఒక్క రాత్రి ఉండాల‌ని నిశ్చ‌యించుకుంటారు. ఆ రాత్రి ఆ పాడుబ‌డ్డ‌ బంగ‌ళాలో వారికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? వారిని చంపాల‌ని ప్ర‌య‌త్నించిన సైకో కిల్ల‌ర్ ఎవ‌రు? ఆ కిల్ల‌ర్ బారి నుంచి ఆరుగురు స్నేహితుల్లో ఒక్క‌రైనా త‌ప్పించుకున్నారా? లేదా? అన్న‌దే కాళ‌రాత్రి మూవీ క‌థ‌.

 

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ…

కాళ‌రాత్రి మూవీ మ‌ల‌యాళం వెర్ష‌న్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్ష‌న్ మాత్రం థియేట‌ర్ల‌ను స్కిప్‌ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. కాళ‌రాత్రి మూవీ కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తోనే తెర‌కెక్కింది. టాక్‌తో సంబంధం లేకుండా ఐదు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. కాళ‌రాత్రి మూవీకి కైలాస్ మీన‌న్ మ్యూజిక్ అందించాడు.

 

జ‌ల్లిక‌ట్టుకు ప్రొడ్యూస‌ర్‌…

కాళ‌రాత్రిలో కీల‌క పాత్ర చేసిన చెంబ‌న్ వినోద్ జోస్ మ‌ల‌యాళంలో వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్నాడు. అంగ‌మ‌లై డైరీస్‌, నార్త్ 24 కొట్టాయం, జ‌ల్లిక‌ట్టు, ఏమాయు, రొమాంచంతో పాటు ప‌లు సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్స్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. మ‌ల‌యాళంలో రెండు సినిమాల‌కు క‌థా ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రించాడు. జ‌ల్లిక‌ట్లుతో పాటు మ‌రికొన్ని సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశాడు.

 

 

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024