BRS Leader : మరో మహిళతో బీఆర్ఎస్ నేత అక్రమ సంబంధం, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెప్పుతో కొట్టి భార్య

Best Web Hosting Provider In India 2024


BRS Leader : ఔను, వాళ్లిద్దరికీ పెళ్ళైంది.‌ ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. కానీ, దారి తప్పారు.‌ కట్టుకున్న వారిని కడుపున పుట్టిన పిల్లలను వదిలేసి హైదరాబాద్ లో మకాం పెట్టారు. ఏడాది కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఆ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న కుటుంబసభ్యులు చితకబాదారు. బీఆర్ఎస్ నాయకుడిగా చలామణి అవుతూ పరువు పోయే పనిచేసిన ఇద్దరికి దేహశుద్ధి చేసి తగిన గుణపాఠం చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి అక్రమ సంబంధం కలకలం సృష్టిస్తోంది.‌ గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం బహిర్గతం అయింది. శ్రీకాంత్ రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా అదే మండలంలోని వివాహిత మహిళలతో ప్రేమాయణం సాగించారు. ఆ మహిళకు సైతం భర్త పిల్లలు ఉన్నారు.‌ కట్టుకున్న వారిని కడుపున పుట్టిన పిల్లలను కాదని ఆ ఇద్దరు ప్రేమాయణం సాగించారు. ఏడాది కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచరుడుగా చలామణి అవుతూ హైదరాబాద్ లో మకాం పెట్టారు.

కుటుంబ సభ్యులు ఇద్దరి కోసం ఆరా తీయగా సికింద్రాబాద్ ఆల్వాల్ లో ఉంటున్నట్లు గుర్తించారు. ఇద్దరు ఉన్నచోటుకు చేరుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు. ఇద్దరిని గంభీరావుపేటకు తరలించారు. శ్రీకాంత్ రెడ్డి భార్య ఆగ్రహావేశాలతో సదరు మహిళను చెప్పుతో చితక్కొట్టారు. భర్త రెండు చేతులు జోడించి దండం పెట్టగా చేసిన తప్పంతా చేసి… అంటూ నిలదీసి చెంప చెల్లుమనిపించారు. అటు సదరు మహిళ కుటుంబ సభ్యులు సైతం కోపంతో ఊగిపోతూ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టాడని శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహంతో కట్టుకున్న వారిని కడుపున పుట్టిన పిల్లలను కాదని అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరికి దేహశుద్ధి చేశారు.

దేహశుద్ధితో దారిలోకి తెచ్చిన బంధువులు

దారి తప్పిన ఇద్దరిని చితక్కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళ బంధువులు శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేస్తుంటే దారి తప్పిన భర్త శ్రీకాంత్ రెడ్డికి భార్య బాసటగా నిలువడం కొసమెరుపు. పరువు పోయిందని భావించిన నాయకులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు‌. పెద్ద మనుషుల సమక్షంలో దారి తప్పిన ఇద్దరిని మందలించి తగిన గుణపాఠం చెప్పారు. మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచిన వివాహ బంధం వివాదస్పదంగా మారకుండా ఇరువురి కుటుంబ సభ్యులను సముదాయించారు. ఒకరి జోలికి మరొకరు వెళ్లకుండా వివాహ బంధం కలకాలం నిలిచేలా బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడు కావడం.. రాజకీయ నాయకుల జోక్యంతో సమస్య ఠాణా మెట్లు ఎక్కకుండానే సద్దుమణిగింది. వివాహేతర సంబంధం దాడిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. టీ కప్పులో తుపానులా సమస్య సద్దుమణిగినప్పటికీ వారి సంసారాలు ఎలా నిలబడతాయేనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రిపోర్టింగ్: కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCrime TelanganaHyderabadBrsSircilla Assembly Constituency

Source / Credits

Best Web Hosting Provider In India 2024