Hyderabad Metro Parking : ప్రయాణికులకు ‘మెట్రో’ షాక్! ఈ స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత, ఇక డబ్బులు కట్టాల్సిందే..

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపో ప్రాంతాల వద్ద కల్పిస్తున్న ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ విధానం అమల్లోకి రాబోతున్నట్లు ప్రకటించింది.

ఎప్పట్నుంచంటే…?

ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్‌ వద్ద ఉన్న మెట్రో పార్కింగ్ లో ఫీజును వసూలు చేయనున్నారు. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి మియాపూర్‌ మెట్రో పార్కింగ్‌ లాట్‌లో పార్కింగ్‌ ఫీజు నిర్ణయం అమల్లోకి వస్తుందని ఎల్‌ అండ్‌ టీ మెట్రో వెల్లడించింది. మెరుగైన సౌకర్యాలతో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో బయో-టాయ్‌లెట్లు కూడా ఏర్పాటు చేస్తామని మెట్రో యాజమాన్యం తెలిపింది. వాహనాల భద్రతకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ ధరలను సూచిస్తూ ఇటీవలే ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. దీని ప్రకారం… బైకును మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.25, 12 గంటల వరకు రూ.40 కట్టాలి. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. అదే 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు అయితే రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు.

ఇటీవలే ప్రతిరోజూ మాదిరిగానే చాలా మంది వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఫీజు గురించి ప్రస్తావించగా…. చాలా మంది వాహనాదారులకు విషయం అర్థం కాలేదు. ఉచిత పార్కింగ్ సౌకర్యం ఉంది కదా అంటూ ప్రశ్నలు సంధించారు. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందుకు సంబంధించి అనేక వార్తలు వార్తలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి.

పార్కింగ్ విషయంలో తలెత్తిన గందరగోళానికి చెక్ పెడుతూ…మెట్రో యాజమాన్యం కూడా ప్రకటన చేసింది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజును వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు నిర్ణయం అమల్లోకి వచ్చే తేదీలను కూడా వెల్లడించింది.

 

 

టాపిక్

Hyderabad MetroHyderabad

Source / Credits

Best Web Hosting Provider In India 2024