Best Web Hosting Provider In India 2024
Ravi Teja: రవితేజ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన నేనింతే మూవీ దాదాపు పదిహేనేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నది. త్వరలో ఈ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ నెలాఖరున లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో నేనింతే మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. నేనింతే రీ రిలీజ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కృష్ణ నగర్ కష్టాలతో…
కృష్ణ నగర్ కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తూ దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. దర్శకులు, నటీనటులు కావాలనే ఆశతో కృష్ణ నగర్‌లో అడుగుపెట్టిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? ఇండస్ట్రీలో సక్సెస్ కావడం వెనుక వారు పడే వ్యథలు, బాధలను ఈ సినిమాలో ఎమోషనల్‌గా చూపించాడు పూరి జగన్నాథ్. నేనింతే మూవీలోని పాటలు, డైలాగ్స్‌తో పాటు రవితేజ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. విమర్శకుల మన్ననలతో పాటు పలు అవార్డులను అందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.
దర్శకుడి జర్నీ…
నేనింతే మూవీలో సినిమా దర్శకుడు కావాలని తపించే రవి అనే యువకుడి పాత్రలో రవితేజ నటించాడు. చాలా ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవికి ఎలా సినిమా అవకాశం వచ్చింది. దర్శకుడిగా స్క్రీన్‌పై తన పేరు చూసుకోవాలని కలలు కన్న రవికి యాదు అనే రౌడీ ఎలాంటి షాకిచ్చాడు. రవిని ప్రేమించిన సంధ్య ఎవరు ఎవరు? అనే కథతోనేనింతే మూవీ సాగుతుంది.
డైరెక్టర్లు గెస్ట్ రోల్స్…
నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీవినాయక్‌తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, రైటర్ కోన వెంకట్ గెస్ట్ రోల్స్ చేశారు.
మూడు నంది అవార్డులు…
నేనింతే మూవీ మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బెస్ట్ హీరోగా రవితేజ, బెస్ట్ డైలాగ్ రైటర్‌గా పూరి జగన్నాథ్, బెస్ట్ ఫైట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్‌లు అవార్డులను గెలుచుకున్నారు. రవితేజ పూరి జగన్నాథ్ కాంబోలో నేనింతేతో పాటు ఇడియన్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణంతో పాటు దేవుడు చేసిన మనుషులు సినిమాలొచ్చాయి.
దేవుడు చేసిన మనుషులు తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ కలిసి సినిమా చేయలేదు. వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తోన్నాయి. ఇటీవలే రవితేజ మిస్టర్ బచ్చన్ , పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ ఒకే రోజు పోటీగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్లుగా తెరకెక్కిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits