Divvela Madhuri : దివ్వెల మాధురి సంచలన వీడియో, కొన్నాళ్లు అందరికీ దూరంగా!

Best Web Hosting Provider In India 2024


Divvela Madhuri : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం కొనసాగుతూనే ఉంది. దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తాజాగా సంచలన ప్రకటన చేశారు. కొంతకాలం మీ అందరికీ దూరంగా ఉంటానని ప్రకటించారు. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు సోషల్ మీడియా, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తాజాగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల జరిగిన కారు ప్రమాదం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యిందని, తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని మాధురి తెలిపారు. మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మీ ముందుకు వచ్చి అన్ని వివరంగా మాట్లాడుతానని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

దువ్వాడ శ్రీనివాస్ వివాదం

దువ్వాడ శ్రీనివాస్‌, వాణి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇరువర్గాల బంధువులు రంగంలోకి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు దువ్వాడ శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన భార్య భార్య దువ్వాడ వాణి కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. తనకు రాజకీయాలు, ఆస్తులు వద్దని తన భర్త తనకు కావాలంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌, తన పిల్లలు, తానూ అందరం కలిసి ఉండడమే తనకు కావాలన్నారు. తనతో కలిసి ఉండేందుకు భర్త ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తానని వాణి చెప్పారు. తన భర్త ఎలా తిరిగినా తనకు సంబంధం లేదని, తమతో మాత్రం కలిసి ఉండాలని కోరారు. కుమార్తె పెళ్లి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. తన పిల్లల భవిష్యత్ తనకు ముఖ్యమన్నారు.

వాణితో ఉండడం సాధ్యం కాదు

అయితే ఇంత జరిగిన తర్వాత తన భార్యతో కలిసి ఉండడం సాధ్యం కాదని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ఈ విషయంపై కోర్డులో తేల్చుకుంటామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు. రూ.27 కోట్ల ఆస్తిని వాణికి రాసిచ్చినట్లు శ్రీనివాస్ చెప్పారు. దువ్వాడ వాణి డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. అయితే గత పది రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దే వాణి నిరసన చేస్తున్నారు. నిరసన విరమించాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా నిరసన విరమించాలని పోలీసులు కోరారు. ముందుగా తన భర్తకు నోటీసులు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వాలని వాణి పోలీసులకు తెలిపారు.

ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తా

మరోవైపు దువ్వాడ వాణి 5 డిమాండ్లను బంధువుల ముందుంచినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్లను పరిష్కరిస్తేనే రాజీ అంటున్నారని బంధువులు తెలిపారు. భర్త దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తన ఇల్లు తప్ప అన్నీ వాణికి ఇచ్చేస్తానని ఒప్పకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వాణి తన కటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్లు సమాచారం. వాణి సిస్టర్స్ రేఖ, రాధ, దువ్వాడ శ్రీనివాస్ వైపు నుంచి సోదరుడు శ్రీధర్ చర్చలు జరుపుతున్నారు.

సంబంధిత కథనం

టాపిక్

SrikakulamYsrcpAndhra Pradesh NewsTrending ApTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024