Best Web Hosting Provider In India 2024
Thangalaan Box Office Collection: చియాన్ విక్రమ్ తంగలాన్ చాలా రోజుల పాటు ఊరించి వచ్చినా.. మొత్తానికి ప్రేక్షకులను నిరాశ పరచలేదు. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరోసారి విక్రమ్ నట విశ్వరూపాన్ని చూపించింది. తొలి రోజు నుంచే వస్తున్న పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తున్నట్లు తాజా కలెక్షన్లు చూస్తే స్పష్టమవుతోంది.
తంగలాన్ బాక్సాఫీస్ కలెక్షన్
తంగలాన్ మూవీ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. అదే రోజు తెలుగులో రెండు, హిందీలో మూడు సినిమాలు రిలీజైనా.. తమిళంలో మాత్రం ఈ సినిమాకు పోటీ ఇచ్చే సినిమా లేకపోయింది. ఇది కూడా తంగలాన్ కు కలిసి వచ్చింది. దీంతో ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.53.64 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
ఇక నాలుగో రోజైన ఆదివారం (ఆగస్ట్ 18), సోమవారం (ఆగస్ట్ 19) రక్షా బంధన్ హాలీడేస్ తో ఈ మూవీ మరిన్ని భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ కూడా నటించిన ఈ తంలాన్ మూవీ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) అసలు స్టోరీని కళ్లకు కట్టింది. ఇందులో విక్రమ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
తంగలాన్ ఎలా ఉందంటే?
స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పా రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. తంగలాన్ కథ మొత్తం 1850 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. వేప్పూరుకు చెందిన గిరిజన నాయకుడు తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతి) ఐదుగురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు.
తంగలాన్‌పై ఊరి జమీందారు పగతో రగిలిపోతుంటాడు. పన్ను కట్టలేదని సాకుగా చూపించి తంగలాన్ భూమిని స్వాధీనం చేసుకుంటాడు. జమీందారు ఆక్రమించుకున్న భూమిని తిరిగి సొంతం చేసుకోవడం కోసం బ్రిటీషర్లతో కలిసి అడవిలో ఓ బంగారు నిధిని వెలికితీయడానికి వెళతాడు తంగలాన్.
ఆ నిధికి ఆరతి రక్షణగా నిలుస్తుంది. అసలు ఆరతి ఎవరు? బంగారం కోసం అడవిలో అడుగుపెట్టిన తంగలాన్‌తో పాటు అతడి బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బ్రిటీషర్ల వెంట వెళ్లిన తంగలాన్ వారిపై ఎందుకు ఎదురుతిరిగాడు అన్నదే ఈ మూవీ కథ.
తంగలాన్ ఓటీటీ రిలీజ్ డేట్
తంగలాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సైంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. తెలుగు, తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి 35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ తంగలాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతోన్నారు. అక్టోబర్ సెకండ్ వీక్‌లో ఓటీటీలో తంగలాన్‌ను ఓటీటీలో రిలీజ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits