Best Web Hosting Provider In India 2024

బొత్సను అభినందించిన వైయస్ జగన్
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైయస్ జగన్‌ను బొత్స సత్యనారాయణకలిశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణను వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ ఛైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు.