Bridal mehendi: పెళ్లి మెహందీ ఎర్రగా పండాలా? ఈ టిప్స్ పక్కాగా పనిచేస్తాయ్ చూడండి

Best Web Hosting Provider In India 2024


పెళ్లికూతురు కళంతా చేతికున్న గోరింటాకుతోనే వస్తుంది. చేతులు ఎంత ఎర్రగా పండితే అంత అందం. అయితే కొన్ని టిప్స్ పాటించారంటే మీ పెళ్లి మెహందీకి మంచి ఎరుపు రంగు వస్తుంది. అవేంటో చూడండి.

నీలగిరి నూనె:

నీలగిరి లేదా యూకలిప్టస్ నూనె వాడితే గోరింటాకు మంచి రంగు వస్తుంది. ఆకుపచ్చ రంగులో ఈ క్యాప్సుల్స్ చాలా సులువుగా దొరుకుతాయి. మెహందీ తీసేశాక వెంటనే ఈ నూనెను మెహందీ డిజైన్ ఉన్న చోటంతా రాసుకోండి. అలా వదిలేస్తే మంచి రంగు వస్తుంది.

చేతులు కడుక్కోండి:

మెహందీ పెట్టుకునే ముందు చేతులు తప్పకుండా కడుక్కోండి. అలాగే మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్లు లాంటివేమీ చేతులకు రాసుకోకండి. వీటివల్ల మెహందీ ఎర్రగా పండదు.

సహజంగా ఆరనివ్వండి:

సమయం లేదు కదాని హడావుడి పడకండి. బ్లో డ్రయర్ , హెయిర్ డ్రయర్ వాడి మెహందీ ఆరబెట్టకండి. దీనివల్ల మెహందీ సరిగ్గా రంగు రాదు. ఆలస్యం అయినా సరే సహజంగానే ఆరనివ్వండి.

లవంగాలు

ఒక పెనం మీద నాలుగైదు లవంగాలు వేసి పొయ్యి మీద పెట్టాలి. వాటినుంచి వచ్చే పొగ మీ మెహందీకి తగిలేలా చేతులు కాస్త దూరంగా చాపాలి. మీరు వేడిని భరించగలిగేంత సేపు అలా ఉంచండి. దీంతో మంచి రంగు వస్తుంది.

నిమ్మరసం, పంచదార

మెహందీ ఆరిపోగానే పెచ్చులుగా ఊడిపోతుంది. అలా ఊడిపోతే సరిగ్గా రంగు రాదు. అందుకే నిమ్మరసంలో కాస్త పంచదాక కలిపి దాన్ని దూదితో మెహందీ మీద పెట్టాలి. దాంతో అది ఊడిపోకుండా. ఈ జిగురు వల్ల అతుక్కుని ఉంటుంది. అలానీ ఎక్కువగా పెడితే రంగు రాదు. దూదితో అలా కాస్త అంటిస్తే చాలు.

బ్యూటీ ట్రీట్మెంట్స్:

పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్ లాంటివన్నీ ముందు చేయించుకున్నాకే మెహందీ పెట్టించుకోండి. లేదంటే ఈ చికిత్సల కోసం వాడే క్రీముల వల్ల మెహందీ రంగు తగ్గిపోతుంది. మీరనకున్న ఫలితం రాదు.

ఎన్ని రోజుల ముందంటే:

మెహందీ పెట్టుకున్న రోజుకున్న తర్వాత రెండు రోజులకు మంచి రంగు వస్తుంది. కాబట్టి మీ పెళ్లి కన్నా కనీసం రెండు మూడు రోజుల ముందు మెహందీ పెట్టుకున్న వేడుక రోజు మెహందీ ఎర్రగా మంచి రంగులో కనిపిస్తుంది.

కట్టు కట్టడం

మెహందీ రంగు రావాలంటే చేతికి మెహందీ ఎక్కువసేపు ఉంచుకోవాలి. కానీ అది ఆరిపోయాక పెచ్చులుగా ఊడిపోతుంది. అందుకే కాటన్ వస్త్రం కానీ, పట్టీ కానీ తీసుకుని మెహందీ ఆరిపోయాక కాస్త వదులుగా కట్టేయాలి. దీంతో మీరేమైనా పొరపాటున తాకినా మెహందీ చెడిపోదు. ఊడిపోదు. ముఖ్యంగా రాత్రి పూట మెహందీ పెట్టుకుంటే ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024