Best Web Hosting Provider In India 2024
PM Modi Instagram followers: భారత ప్రధాని నరేంద్ర మోడీని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ దాటేశారు. నరేంద్ర మోడీని ఇన్‌స్టాలో ప్రస్తుతం 91.3 మిలియన్ మంది ఫాలో అవుతుండగా, 91.4 మిలియన్ల ఫాలోయర్లతో శ్రద్ధ కపూర్ అధిగమించారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న 37 ఏళ్ల శ్రద్ధా కపూర్ ఇటీవల నటించిన హారర్ కామెడీ మూవీ “స్త్రీ 2” ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తర్వాత మెటాకి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీగా శ్రద్ధాకపూర్ నిలిచారు. ఇన్‌స్టాలో కొంచెం తక్కువ మంది ఫాలోయర్లు ఉన్నప్పటికీ ఎక్స్ (ట్విట్టర్)లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ 101.2 మిలియన్ల ఫాలోయర్లతో గ్లోబల్ లీడర్‌గా కొనసాగుతున్నారు.
విరాట్ కోహ్లీని ఇన్‌స్టాగ్రామ్‌లో 271 మిలియన్ మంది ఫాలో అవుతుండగా.. ప్రియాంక చోప్రాని 91.8 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. వీరి తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు అలియా భట్‌కు 85.1 మిలియన్ల ఫాలోవర్లు, దీపికా పదుకొణెకు 79.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్, పోప్ ఫ్రాన్సిస్ వంటి ఇతర ప్రపంచ స్థాయి నాయకుల కంటే ప్రధాని మోడీ ఇన్‌స్టా ఫాలోయర్లలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 26.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి 27.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఎక్స్ అకౌంట్‌కి 56 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.
రూ.300 కోట్ల మార్కుకి చేరువలో ‘‘స్త్రీ 2’’
రాజ్ కుమార్ రావ్‌తో కలిసి శ్రద్ధ కపూర్ నటించిన ఈ స్త్రీ2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకి ఇది సీక్వెల్. “ఖేల్ ఖేల్ మే”, “వేద” చిత్రాలతో కలిసి ఒకేరోజు థియేటర్లలోకి వచ్చినా పోటీనీ ఎదుర్కొని హిట్ టాక్ తెచ్చుకుంది.
అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన “స్త్రీ 2” చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశాడు. స్త్రీ2 సక్సెస్ పార్టీని కూడా లాస్ట్ వీకెండ్ శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావుతో కలిసి చిత్ర యూనిట్ చేసుకుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits