Best Web Hosting Provider In India 2024
Kalki 2898 AD OTT Release Date: ఇండియన్ సినిమా ఈ ఏడాది చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 ఏడీ. ప్రభాస్, దీపిక నటించిన, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసి.. ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ మూవీగా నిలిచిన ఈ కల్కి 2898 ఏడీ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్
కల్కి 2898 ఏడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో గురువారం (ఆగస్ట్ 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ మూవీ అందుబాటులోకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల్లోనూ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రానుంది.
ఇక నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రెండు ఓటీటీల్లోనూ ఆగస్ట్ 22 నుంచే మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు కొన్ని రోజుల కిందటే వెల్లడైంది. కల్కి హిందీ వెర్షన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. మిగతా భాషల వెర్షన్లను ప్రైమ్ వీడియో దక్కించుకుంది.
కల్కి 2898 ఏడీ ఫ్యాన్ థియరీస్
కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు కొన్ని గంటల ముందు ప్రైమ్ వీడియో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. అది మూవీ సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతోందో అని ఊహించి ఫ్యాన్స్ క్రియేట్ చేసిన కొన్ని థియరీలు. వీటికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమాధానాలు చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు. నిజానికి స్టోరీ గురించి ఫ్యాన్స్ వేసిన అంచనాలు చాలా ఇంట్రెస్టింగా ఉన్నాయి.
రెండో పార్ట్ లో బుజ్జియే తెల్ల గుర్రంగా మారి దీపికకు పుట్టబోయే కొడుకును తీసుకొస్తుందని ఓ ఫ్యాన్ ఊహించి రాశాడు. దీనిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ఊహ బాగున్నా అది నిజం కాదని స్పష్టం చేశాడు. అసలు ప్రభాస్.. దీపిక కొడుకే అని, ఆమెను కాపాడటానికి భవిష్యత్తు నుంచి వస్తాడని ఓ అభిమాని చెప్పగా.. ఇదేదో టెర్మినేటర్ స్టోరీలాగా ఉందని అన్నాడు.
రెండో భాగంలో దుల్కర్ సల్మాన్ పాత్ర మళ్లీ వచ్చి ప్రభాస్ గురించి రివీల్ చేస్తుందని.. ఇక విజయ్ దేవరకొండ పాత్ర కూడా మళ్లీ వచ్చి ప్రభాస్ తో చేతులు కలిపి సుప్రీమ్ యాస్కిన్ ను అంతం చేస్తుందన్న థియరీలు కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, అయితే వీటిలో ఏదీ నిజం కాదని నాగ్ అశ్విన్ స్పష్టం చేశాడు.
అయితే రెండో భాగం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఫ్యాన్స్ ఆసక్తి మొత్తం మరికొన్ని గంటల్లో రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టబోతున్న కల్కి 2898 ఏడీ తొలి భాగంపైనే ఉంది. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో ఈ మూవీ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits