Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి – రెండు రోజులు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌

Best Web Hosting Provider In India 2024


Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూప‌ర్ హిట్ మూవీని వీకెండ్‌కు ఫ్రీగా తెలుగు ఫ్యాన్స్ అంద‌రూ ఓటీటీలో చూడొచ్చ‌ని స‌న్ నెక్స్ట్ ప్ర‌క‌టించింది. ఇందుకోసం ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు, మెంబ‌ర్‌షిప్ కూడా అవ‌స‌రం లేద‌ని స‌న్ నెక్స్ట్ వెల్ల‌డించింది. అయితే ఈ ఆఫ‌ర్ రెండు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నుంది. ఆగ‌స్ట్ 24, 25 తేదీల్లో మాత్ర‌మే స‌న్ నెక్స్ట్ ఓటీటీలో శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ మూవీని చూడొచ్చు.

త‌మిళ్ మూవీ కూడా…

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌తో పాటు జీవా హీరోగా న‌టించిన త‌మిళ మూవీ శివ మ‌న‌సుల‌శ‌క్తి మూవీ కూడా వీకెండ్‌లో ఫ్రీగా చూడొచ్చంటూ స‌న్ నెక్స్ట్ ట్వీట్ చేసింది. ఈ రెండు సినిమాల పోస్ట‌ర్స్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది స‌న్ నెక్స్ట్‌.

2004లో రిలీజ్‌…

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ మూవీ 2004లో తెలుగులో రిలీజైంది. జ‌యంత్ సీ ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డులు క్రియేట్ చేసింది.

2023లో రీ రిలీజైన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌ మూవీ తొలిరోజు 23 ల‌క్ష‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అప్ప‌ట్లో రీ రిలీజ్ సినిమాల్లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. 2024లో చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌రోసారి ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ ఇంద్ర కూడా పోటీగా రీ రిలీజ్ కావ‌డంతో వాయిదావేశారు.

సోనాలి బింద్రే హీరోయిన్‌…

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే హీరోయిన్‌గా న‌టించింది. శ్రీకాంత్‌, గిరీష్ క‌ర్నాడ్‌, ప‌రేశ్ రావ‌ల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. శ‌ర్వానంద్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపించాడు. దేవిశ్రీప్ర‌సాద్ అందించిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి.

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిందీలో విజ‌య‌వంత‌మైన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. హిందీలో మూవీలో సంజ‌య్‌ద‌త్ హీరోగా న‌టించాడు. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు సీక్వెల్‌గా శంక‌ర్‌దాదా జిందాబాద్ మూవీ కూడా వ‌చ్చింది. సీక్వెల్ మాత్రం అంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది.

విశ్వంభ‌ర‌తో బిజీ…

ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో విశ్వంభ‌ర రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో త్రిష తో పాటు మీనాక్షి చౌద‌రి, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి విశ్వంభ‌ర సినిమాకు మ్యూజిక్ అందిస్తోన్నాడు. దాదాపు 170 కోట్ల బ‌డ్జెట్‌తో యూవీ క్రియేష‌న్స్ సంస్థ విశ్వంభ‌ర మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. విశ్వంభ‌ర త‌ర్వాత సోగ్గేడే చిన్ని నాయ‌న ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ‌తో చిరంజీవి ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత ప్రొడ్యూస్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024