Best Web Hosting Provider In India 2024

Bapatla Kendriya Vidyalaya: బాపట్ల కేంద్రీయ విద్యాలయలో ప్రమాదం జరిగింది. శనివారం సైన్స్ ల్యాబ్ లో ప్రమాదకర వాయువులు విడుదలయ్యాయి. ఈ ఘటనలో ల్యాబ్ లో ఉన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాయువుల తీవ్రతకు ఊపిరి ఆడకపోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదకర వాయువులు పీల్చడంతో కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఉపాధ్యాయులు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స ఉందిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
GunturStudentsAccidentsAndhra Pradesh NewsTrending ApTelugu News