GATE 2025 Registration : నేటి నుంచి గేట్​ 2025 రిజిస్ట్రేషన్స్​​- పూర్తి వివరాలు..

Best Web Hosting Provider In India 2024


ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ గేట్  2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేడు ప్రారంభించనుంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు https://gate2025.iitr.ac.in/ వద్ద గేట్​ 2025కి దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 15 తేదీల్లో నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి సబ్జెక్టులపై అభ్యర్థుల సమగ్ర అవగాహనను అంచనా వేసే జాతీయ స్థాయి పరీక్ష గేట్.

ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫైనల్ ఇయర్​లో ఉన్నవారు కూడా ఈ పరీక్షకు అర్హులు. అంతేకాకుండా సైన్స్ విభాగంలో కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నా లేదా పూర్తి చేసిన అభ్యర్థులు కూడా గేట్ పరీక్ష 2025కు అర్హులు.

గేట్ రిజిస్ట్రేషన్ 2025..

గేట్ 2025 పరీక్ష అధికారిక బ్రోచర్ ప్రకారం, పరీక్ష రిజిస్ట్రేషన్ ఆగస్టు 24, 2024న ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నాలుగు తేదీల్లో అంటే ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ఇదీ చూడండి:- NEET PG Results 2024 : నీట్​ పీజీ ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

గేట్ 2025 పరీక్ష తేదీ, చివరి తేదీ, ఫీజు, ఇతర వివరాలు

గేట్ 2025 పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీ సెప్టెంబర్ 26, 2024. అయితే ఆలస్య రుసుముతో 2024 అక్టోబర్ 7 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2025 పరీక్ష బ్రోచర్ ప్రకారం 2025 మార్చి 19న ఫలితాలను ప్రకటిస్తారు.

గేట్ 2025 పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీ విద్యార్థులకు రూ.1800. చివరి తేదీ తర్వాత పరీక్ష ఫీజు రూ.2300కు పెరుగుతుంది. మహిళా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు గేట్ పరీక్ష 2025 రిజిస్ట్రేషన్ ఫీజు రూ.900 కాగా, సెప్టెంబర్ 26 తర్వాత దీన్ని రూ.1400కు పెంచనున్నారు.

గేట్ 2025..

గేట్ 2025 పరీక్ష వ్యవధి మూడు గంటలు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో జనరల్ ఆప్టిట్యూడ్ (జీఏ), ఇతర సబ్జెక్టుల్లోని రెండు విభాగాల ప్రశ్నలను ప్రయత్నించాల్సి ఉంటుంది. 10 జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు, 55 సబ్జెక్టు ప్రశ్నలు కలిపి మొత్తం 65 ప్రశ్నలు ఉంటాయి.

గేట్ 2025ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. మొత్తం 30 టెస్ట్ పేపర్లు ఉంటాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్​లో మాత్రమే ఉంటుంది. గేట్ 2025లో అభ్యర్థులు సాధించిన స్కోర్లు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్ (ఎన్​సీబీ) – గేట్ తరఫున ఐఐఎస్సీ (ఐఐఎస్​సీ), ఐఐటీ దిల్లీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తాయి.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link