Best Web Hosting Provider In India 2024
భార్యపై ప్రేమతో షాజహాన్ తాజ్‌మహల్ నిర్మించాడు. అది ప్రపంచ వింతల్లో ఒకటి అయ్యింది. అయితే.. భార్యపై ప్రేమతో ప్రతీ ఒక్కరు తాజ్ మహల్‌ను నిర్మించలేరు. అలాగని ప్రేమను దాచుకోలేరు. హనుమకొండ జిల్లాల్లో కూడా ఓ భర్త తన భార్యపై ఉన్న ప్రేమను దాచుకోలేదు. తాజ్ మహల్ లాంటి పెద్ద కట్టడం కట్టలేదు గానీ.. తన భార్యకు గుర్తుగా 8 అడుగులు ప్రేమ చిహ్నాన్ని ఆమె సమాధి వద్ద నిర్మించాడు.
భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలని..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన రిపిక శివరాజ్.. 2018లో మానసను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శ్రీహిత, మేఘశ్రీత అనే ఇద్దరు కూతుళ్లు పుట్టారు. జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతోంది. వారి ఆనందాన్ని చూసి అసూయపడిన దేవుడు వారి పట్ల చిన్నచూపు చూశాడు. శివరాజ్ భార్య మానసను అనారోగ్యానికి గురిచేశాడు. అంతుబట్టని విష జ్వరంతో మానస గతేడాది ఆగస్టు నెలలో మరణించింది. తన భార్య జ్ఞాపకాలు గుర్తుండిపోవాలని.. శివరాజ్ ఇలా సమాధిపై ప్రేమ చిహ్నాన్ని నిర్మించారు.
కోతులకో పండ్ల వనం..
మానవుడు తన స్వార్థం కోసం చెట్లను నరికి వేస్తున్నాడు. దీంతో అడవులు తగ్గి.. కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామ ప్రజలు వినూత్న ఆలోచన చేశారు.
గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వాటి కోసం ప్రత్యేకంగా తోట పెంచారు. ఇందుకు అధికారులు సహకరించారు. గతేడాది గుర్మిళ్లపల్లి శివారులోని ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల్లో రూ.2.85 లక్షలు నిధులతో పండ్ల తోటను పెంచారు. జామ, నేరెడు, మామిడి, సీతాఫలం, దానిమ్మ వంటి పండ్ల మొక్కలతో పాటు వేప, చింత చెట్లను పెంచుతున్నారు. దీని కారణంగా కోతుల బెడద తగ్గుతుందని చెబుతున్నారు.
టాపిక్