Best Web Hosting Provider In India 2024
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజ్ విపరీతంగా ఉంది. సుజీత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టడంతో ఓజీ షూటింగ్ నిలిచింది. అయితే, త్వరలోనే ఆయన మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో రిలీజ్ డేట్‍ను ఈ మూవీ ఖరారు చేసిందనే సమాచారం బయటికి వచ్చింది.
రిలీజ్ డేట్ ఇదేనా!
ఓజీ సినిమాను వచ్చే ఏడాది (2025) మార్చి 27వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ సమ్మర్ డేట్‍నే ఖరారు చేశారని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మార్చి 30న ఉగాది, మార్చి 31 రంజాన్ ఉండటంతో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని మేకర్స్ మార్చి 27ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
అప్‍డేట్ ఎప్పుడంటే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. అయితే, అందుకు ఒక్క రోజు ముందే అంటే రేపే (సెప్టెంబర్ 1) ఓజీ సినిమా నుంచి అప్‍డేట్ వస్తుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ వీడియోను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. అందులోనే ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుందంటూ రివీల్ చేయనున్నారని తెలుస్తోంది. రేపు కాకపోతే సెప్టెంబర్ 2న రిలీజ్ డేట్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
రామ్‍చరణ్ పుట్టిన రోజున!
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ పుట్టిన రోజు మార్చి 27నే ఉంది. యాదృచ్ఛికంగా ఓజీ సినిమా రిలీజ్‍ను కూడా మేకర్స్ అదే రోజున ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మార్చి 27న ఈ మూవీ వస్తే.. లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. మార్చి 30వ తేదీ ఆదివారంతో పాటు ఉగాది పండుగ ఉంది. మార్చి 31వ తేదీ రంజాన్ సెలవు ఉంటుంది.
ఓజీ సినిమా షూటింగ్‍లో పవన్ కల్యాణ్ త్వరలోనే మళ్లీ పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ లుక్‍లోకి క్రమంగా ఆయన వస్తున్నారు. చిత్రీకణకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందనుంది.
ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని సుజీత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ క్యారెక్టర్ పేర్ ఓజాస్ గంభీర అని, అందుకే ఓజీ టైటిల్ పెట్టామని ఆయన చెప్పారు. ఈ మూవీకి జపనీస్ లింక్ కూడా ఉంటుందని అన్నారు.
ఓజీ మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‍గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయారెడ్డి, ప్రకాశ్ రాజ్, హరిష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
పవన్ కల్యాణ్ లైనప్‍లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ చిత్రాల నుంచి కూడా అప్‍డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits