Best Web Hosting Provider In India 2024
కంటెంట్ ఉంటే స్టార్లు లేకపోయినా సినిమా సక్సెస్ అవుతుందని ‘కమిటీ కుర్రాళ్ళు’ ఇటీవలే మరోసారి నిరూపించింది. ఈ రూరల్ కామెడీ డ్రామా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఈ కామెడీ డ్రామా చిత్రానికి యధు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న రిలీజైన ఈ లోబడ్జెట్ విలేజ్ ఎంటర్టైనింగ్ మూవీ బ్లాక్బస్టర్ కొట్టింది. మెగా డాటర్ కొణిదెల నిహారిక సినీ ప్రొడ్యూజర్గా ఫస్ట్ సినిమాతోనే విజయం కైవసం చేసుకున్నారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కమిటీ కుర్రోళ్ళు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. ఈ విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ మూవీని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు ఆ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తేదీ ఇదే! పండుగ సందర్భంగా..
కమిటీ కుర్రోళ్ళు సినిమాను సెప్టెంబర్ 6వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకురావాలని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వినాయక చవితి (సెప్టెంబర్ 7) పండుగ సందర్భంగా ఒక రోజు ముందే ఈ మూవీని తీసుకురావాలని డిసైడ్ అయిందట. స్ట్రీమింగ్ డేట్ను ఈటీవీ విన్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
అంచనాల కంటే ముందుగానే..
కమిటీ కుర్రోళ్ళు సినిమాను సెప్టెంబర్ రెండో వారంలో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్కు తీసుకొస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే, పండుగ ఉండటంతో తొలి వారమే బెస్ట్ అని ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే అంచనాల కంటే ఒక వారం ముందుగా సెప్టెంబర్ తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్కు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
గోదావరిలోని ఓ గ్రామంలో స్నేహితుల చుట్టూ కమిటీ కుర్రోళ్ళు సినిమా సాగుతుంది. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ యధు వంశీ. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్, శ్యామ్ కల్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, తేజస్వి రావ్ కీలకపాత్రలు పోషించారు.
కమిటీ కుర్రోళ్ళు కలెక్షన్లు
కమిటీ కుర్రోళ్ళు సినిమా సినిమా సుమారు రూ.5కోట్లలోపు బడ్జెట్తో రూపొందినట్టు అంచనా. ఈ మూవీ దాదాపు రూ.17కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. నిర్మాతగా నిహారిక మంచి సక్సెస్ అందుకున్నారు.
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీ హక్కులను ముందుగా ఓ ప్లాట్ఫామ్ తీసుకోలేదని నిహారిక చెప్పారు. అయితే, రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ రావటంతో ప్లాట్ఫామ్లో పోటీ పడ్డాయని సక్సెస్ మీట్లో వెల్లడించారు. ఓటీటీ హక్కులను డబుల్ డిమాండ్ పెరిగిందని అన్నారు. మొత్తానికి ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈ చిత్రాన్ని తీసుకుంది.
కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఈ మూవీకి ఇడురోలు రాజు సినిమాటోగ్రఫీ చేయగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా పనితనం, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits