Best Web Hosting Provider In India 2024
Nivetha Thomas About Girls Marriage: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ మూవీ ’35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ అండ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. “35-చిన్న కథ కాదు” సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ఇందులో మదర్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఎలా అనిపించింది?
-’35-చిన్న కథ కాదు’ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ స్టొరీ. స్టార్ట్ టు ఫినిష్ ఆ వరల్డ్‌లో కాంప్రమైజ్ లేకుండా రాసిన స్టొరీ. నివేదా థామస్ కాకుండా సరస్వతి పాత్రే కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా ఇష్టం.
-ఇండియన్ సొసైటీలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని జనరల్‌గా అడుగుతారు. అలాటింది నేను 20 ఏళ్లు దాటాక హౌస్ వైఫ్, తల్లి పాత్ర చేస్తే తప్పేముంది. అందులో పెద్ద ప్రాబ్లమ్ లేదు. దీని ప్రభావం నా తర్వాతి సినిమాలపై పడుతుందని ఆలోచించాను. కానీ, యాక్టర్‌గా అన్ని పాత్రలు చేయాలి. మదర్‌గా బాగా చేశాను అనే బదులు సరస్వతి పాత్రని బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను (నవ్వుతూ).
-నాకంటూ ఒక ప్యాట్రన్‌ని సెట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నివేదా ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మగలిగితే యాక్టర్‌గా అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. సినిమా చూశాక తల్లి పాత్రలకు మాత్రమే నివేదా సరిపోతారు అని మీరు రాయకుండా ఉంటే చాలు (నవ్వుతూ).
-ఇందులో సరస్వతి పాత్రకు నాకు ఏజ్‌లో పెద్ద తేడా లేదు. సరస్వతి ఏజ్‌లో నాకంటే ఏడాది చిన్నది. తనకి చిన్న ఏజ్‌లోనే పెళ్లి అవుతుంది. ఆమెకి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెలో ఒక చైల్డ్ నేచర్ ఉంటుంది. ఇందులో యూత్ లవ్ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్‌ఫ్లోర్ చేయడం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.
ఈ కథలో మిమ్మల్ని ఎగ్జయిట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-35-చిన్న కథ కాదు వెరీ రూటెడ్ స్టొరీ. డైరెక్టర్ నంద కిషోర్ కథని అద్భుతంగా రాశారు. ఇందులో తిరుపతి తిరుమల వేంకన్న స్వామి కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ ఇంత రీజినల్‌గా రూటెడ్‌గా ఉండటం నాకు చాలా నచ్చింది. డివైన్ ఫీలింగ్ అన్ని సీన్స్‌లో ఉంటుంది. ఎన్నోసెంట్ ఫ్యామిలీ స్టొరీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది.
తిరుపతి స్లాంగ్ కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేశారు?
-గట్టిగా ట్యూషన్ జరిగింది. దాదాపు నెల రోజులు వర్క్ షాప్ చేశాం. స్లాంగ్ కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకమే ప్రిపేర్ చేయడం జరిగింది. సింక్ సౌండ్ కావడంతో ప్రతి వర్డ్‌ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. అలాగే పిల్లలు కూడా చాలా ప్రిపేర్ అయ్యారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits