Salt Lamp: లావాలా మెరిసే ఈ ఉప్పు దీపం ఇంట్లో ఉంటే ఆరోగ్యం, దీన్ని దేంతో తయారు చేస్తారు?

Best Web Hosting Provider In India 2024


సాల్ట్ ల్యాంప్ గురించి విన్నారా? చాలా సార్లు చూసే ఉంటారు కూడా. సాల్ట్ ల్యాంప్ అంటే తెలుగులో ఉప్పు దీపం అనే అర్థం వస్తుంది. కానీ నిజానికి ఉప్పుతో దీపం వెలిగిపోదు. ఉప్పు వెలుగుతుంది అంతే. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

సాల్ట్ ల్యాంప్ అంటే ఏమిటి?

సాల్ట్ ల్యాంపులను హిమాలయన్ పింక్ సాల్ట్ క్రిస్టల్స్‌తో తయారు చేస్తారు. ఒక పెద్ద ఉప్పు రాయి మధ్య లోపలి భాగంలో ఖాళీ భాగం ఉండేలా తయారు చేసి, మధ్యలో విద్యుత్తుతో వెలిగే ఒక బల్బును అమరుస్తారు. ఆ బల్బ్ వెలిగితే దాని చుట్టూ ఉన్న ఉప్పు రాయి కూడా వెలిగిపోతుంది. ఇది వరకు దీన్ని కేవలం అలంకరణ వస్తువులాగా మాత్రమే వాడేవారు. కానీ దానివల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలున్నాయి.

సాల్ట్ ల్యాంప్ ఆరోగ్య ప్రయోజనాలు:

సాల్ట్ ల్యాంప్ వెలిగించినప్పుడు నెగటివ్ అయాన్లను విడుదల చేస్తుంది. ఇవి ఆరోగ్యానికి మంచివని చెబుతారు. అలాగే ఉప్పు రాయికి గాల్లో ఉన్న తేమని పీల్చుకునే గుణం ఉంటుంది. తేమతో పాటూ వాటితో ఉన్న దుమ్ము, దూళి, చెడు అణువులు ఉప్పు రాయికి అంటుకుంటాయి. తర్వాత ఈ రాయి శుభ్రమైన గాలిని విడుదల చేస్తుంది. చెప్పాలంటే మన చుట్టూ ఉండే గాలి నాణ్యత ఈ ఉప్పు దీపం వెలిగించడం ద్వారా మెరుగుపడుతుంది.

మంచి నిద్ర కోసం:

ఈ ల్యాంప్ నుంచి వెలువడే కాంతితో మంచి నిద్ర పడుతుంది. ఆ కాంతి చూడ్డానికి ప్రశాంతంగా అనిపిస్తుంది. దాంతో మంచి వాతావరణం వల్ల తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉంది. ఈ ల్యాంప్ ఆకారం, వాటి బరువు బట్టి వాటి నుంచి వెలువడే కాంతి రంగు కూడా మారుతూ ఉంటుంది.

శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గడంలో:

ఎలర్జీలు, ఆస్తమా లాంటి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గించడంలో సాల్ట్ థెరపీ సాయపడుతుందని చెబుతారు. శ్వాస సంబంధిత వ్యాధుల గురించి తెలిపే పురాతన హాలోథెరపీ విధానంలో దీర్ఘకాలిక శ్వాస వ్యాధులతో బాధ పడేవారు ఉప్పు గుహలో కూర్చోవడం వల్ల వాటిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కాబట్టి ఈ ఉప్పు దీపం వాడటం వల్ల కూడా కొద్దిగా ఆ లాభం ఉండొచ్చని నమ్మకం. అంతేకాక గాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ తొలగించి జలుబు, దగ్గు రాకుండా ఈ దీపాలు కాపాడతాయట.

మానసిక స్థితి:

ఈ ల్యాంపుల నుంచి విడుదలయ్యే నెగటివ్ అయాన్ల వల్ల ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. వీటివల్ల మెదడుకు ఆక్సీజన్ సరఫరా పెరిగి ఏకాగ్రత ఎక్కువవుతుంది. అంతేకాదు ఆ అయాన్ల వల్ల సెరటోనిన్ విడుదలయ్యి ఆనందంగా ఉండేలా చేస్తాయట.

ఆకర్షణ:

ఆరోగ్య ప్రయోజనాలతో పాటూ ఈ ల్యాంప్ మంచి అలంకరణ వస్తువులాగా పనికొస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక గదిలో కేవలం ఈ ల్యాంప్ మాత్రమే వెలిగిస్తే మంచి అనుభూతి ఇస్తుంది. అయితే వీటిని కొనేటప్పుడు నాణ్యత తప్పకుండా చూడాల్సిందే. అలాగే ల్యాంప్ కింది భాగం ఎలా ఉందనీ గమనించుకొని కొనుగోలు చేయాలి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024