Organ donation myths: అవయవ దానం గురించి అపోహలెందుకు? ఒక దాత ఎన్ని ప్రాణాలను నిలబెట్టగలడో తెల్సుకోండి

Best Web Hosting Provider In India 2024


మనిషి చనిపోయాక అవయవ దానం చేసి మరో ప్రాణాన్ని నిలబెట్టొచ్చు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అవయవ దానం గురించి చాలా మందికి అపోహలుంటాయి. అసలు ఎలాంటి అవయవాలను దానం చేయొచ్చు? ఒక మనిషి దానం ఎంత మంది ప్రాణాల్ని నిలబెడుతుందో తెలిస్తే ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది.

అవయవ దానం ఒక మహత్తర కార్యం. కాలేయం పాడైన వాళ్లకి, మూత్ర పిండాల్లాంటి అవయవాల వైఫల్యంతో బాధపడుతున్నవాళ్లకి జీవితంలో రెండో అవకాశం ఇస్తుందిది. అవయవాలను దానం చేయడం వల్ల ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి, విపత్కర ఆరోగ్య పరిస్థితులు ఎదుర్కుంటున్న వాళ్లకి ఊపిరిపోస్తాయి.

ఏమేం దానం చేయొచ్చు?

గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పేగులు సాధారణంగా దానం చేసే అవయవాలు. వీటితో పాటే కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముక వంటి వివిధ కణజాలాలను కూడా దానం చేయవచ్చు. దీని అవసరంలో ఉన్న చాలా మంది రోగులకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఎనిమిది మందికి ప్రాణం పోయొచ్చు:

చనిపోయిన వ్యక్తి అతని అవయవాలు దానం చేసి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు. ఒక జత మూత్రపిండాలు డయాలసిస్ మీద ఆధారపడి ఉన్న ఇద్దరు వ్యక్తుల సమస్య తగ్గించగలవు. రెండు ఊపిరితిత్తులు ఇద్దరు ప్రాణాలను కాపాడగలవు. క్లోమం దానం ఒకరి ప్రాణం కాపాడుతుంది. దానం చేసిన హృదయం అవసరంలో ఉన్నవారికి జీవితం మీద ఆశను చిగురించేలా చేయగలదు.

దాత సజీవంగా ఉన్నప్పుడు కూడా అవయవ దానం చేయొచ్చు. అలాగే దాత మరణించినప్పుడు శవ దానం చేయొచ్చు. అవయవ మార్పిడి చికిత్స కోసం కొన్ని మిలియన్ల మంది ఎదురు చూస్తున్నారు. కానీ అవయవాలు దానం చేసేవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వీళ్ల చికిత్స అలాగే ఆగిపోతుంది. అవయవ దానం గురించి అనేక అపోహలుండటమే దానికి కారణం.

అవయవదానం గురించి అపోహలు:

అపోహ #1:

యవ్వన వయస్కులు మాత్రమే అవయవాలను దానం చేయగలరు

వాస్తవం: ఇది అబద్ధం. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా అవయవదానం కోసం రిజిస్టర్ చేసుకుని అవయవాలను దానం చేయవచ్చు. ఎలాంటి వదంతులు, సోషల్ మీడియా పోస్టులను నమ్మొద్దు. ఒకరి ఆరోగ్య స్థితిని తనిఖీ చేసిన తరువాత అతను / ఆమె అవయవ దానానికి అర్హులా కాదా అని నిర్ణయిస్తారు.

అపోహ # 2:

అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంటే వారి కుటుంబ సభ్యులపై ఛార్జీలు వసూలు చేస్తారు

వాస్తవం: అవయవ, నేత్ర, కణజాల దానం కోసం దాత కుటుంబానికి ఎటువంటి ఖర్చు ఉండదు. కాబట్టి, భరోసాతో ముందుకు రండి. అవయవాలను దానం చేసి కొందరికి జీవితాలను మార్చే మహత్తర కార్యం కోసం కీలక అడుగు వేయండి. కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో పోరాడుతున్న వారి మనుగడ కోసం ఇతరులను కూడా అవయవ దానం చేయమని ప్రోత్సహించండి.

సజీవ అవయవ దానం:

కిడ్నీ, లివర్ మార్పిడి అవసరం ఉన్నవాళ్లకి వాళ్ల కుటుంబ సభ్యులు అవయవ దానం చేయొచ్చు. అంటే దాత సజీవంగా ఉన్నప్పుడే చేయగలిగే అవయవ దానం ఇది. కాలేయంలో కొంత భాగం, ఒక కిడ్నీని ఒకరి ప్రాణం కాపాడటానికి దానం చేయవచ్చు.

గణాంకాలు:

భారతదేశంలో, 2023 సంవత్సరంలో మొత్తం 18,378 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 10 సజీవ అవయవ దాతలలో ఆరుగురు మహిళలు ఉన్నారని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో) విడుదల చేసిన డేటా చెబుతోంది.

దేశంలో 197 ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లో భారతదేశం మరో మైలురాయిని సాధించింది. మొదటిసారిగా ఈ సంవత్సరంలో 1,000 మందికి పైగా మరణించిన వ్యక్తులు అవయవ దానం చేశారు. 2013లో 837గా ఉన్న అవయవ మార్పిడి చికిత్స సంఖ్య 2023 నాటికి 2,935కు పెరిగింది.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024