Best Web Hosting Provider In India 2024
టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తదుపరి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నారు. చేతికి స్వల్ప గాయం కూడా అవడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఈ తరుణంలో కర్ణాటకకు వెళ్లారు ఎన్టీఆర్. తన తల్లితో కలిసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. నేడు (సెప్టెంబర్ 1) మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు.
తల్లి పుట్టిన రోజు ముందు..
జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినా సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ తరుణంలో ఆమెను సొంతఊరు కుందాపురాకు ఎన్టీఆర్ తీసుకెళ్లారు. శనివారం ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న వారు.. నేడు కొల్లూరులోని మూకాంబిక ఆలయానికి వెళ్లారు. ఎన్టీఆర్ వెంట కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.
తల్లితో కలిసి నేడు మూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు ఎన్టీఆర్. పంచె కట్టులో సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాంతార చాప్టర్-1లో నటిస్తున్నారా?
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా 2022లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‍గా కాంతార చాప్టర్ 1 చేస్తున్నారు రిషబ్. ఈ సినిమాలకు దర్శకుడు కూడా ఆయనే. రిషబ్ శెట్టితో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. కర్ణాటకకు వెళ్లిన ఎన్టీఆర్‌ను విమానాశ్రయంలోనే రిషబ్ రిసీవ్ చేసుకున్నారు. ఆయన వెంట ఆలయాలకు కూడా వెళుతున్నారు.
దీంతో, కాంతార చాప్టర్-1 సినిమాలో నటిస్తున్నారని రూమర్లు ఉన్నాయని, అది నిజమా అని ఎన్టీఆర్‌ను ఓ పాత్రికేయుడు అడిగారు. దీనికి ఆయన స్పందించారు. రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తే తాను రెడీ అన్నారు. “ఒకవేళ కాంతారలో నన్ను భాగం చేయాలని రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తే.. నేను రెడీ” అని ఎన్టీఆర్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పటికే కాంతార ప్రీక్వెల్‍కు చాలా క్రేజ్ ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ కూడా నటిస్తే నెక్స్ట్ లెవెల్‍కు వెళుతుంది.
తల్లి ఆకాంక్ష మేరకు..
ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని శనివారం (ఆగస్టు 31) దర్శించుకున్నారు ఎన్టీఆర్. తాను సొంత ఊరు కుందాపురకు తీసుకెళ్లి ఊడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శింపజేయాలని తన తల్లికి ఉన్న కల నెలవేరిందని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడు మూకాంబిక ఆలయానికి వెళ్లారు.
ఎన్టీఆర్ తదుపరి దర్శకుడు ప్రశాంత్ నీల్‍తో మూవీ చేయనున్నారు. ఉడుపి మఠానికి ఎన్టీఆర్, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కలిసి వెళ్లారు. ఎన్టీఆర్ – నీల్ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో పాన్ ఇండియా రేంజ్‍లో చాలా హైప్ ఉంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పాపులర్ కాగా.. త్వరలోనే మూడో సాంగ్ రానుంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits