తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం వైయ‌స్ఆర్‌

Best Web Hosting Provider In India 2024

అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా..వైయ‌స్ఆర్‌

పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు

వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు

రేపు మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి 

వైయ‌స్ఆర్‌ .. ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది. మహానుభావుడు.. అంటూ ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత వైయ‌స్ఆర్‌.. ది లెజెండ్‌.

2009.. సెప్టెంబర్‌ 2. ఒక దుర్దినం. 
తెలుగుజనం గుండెమీద బండ పడ్డ దినం.
నిరంతరం తమ గురించి, తమ మేలు గురించి ఆలోచించే ఓ పాలకుడిని కోల్పోయిన రోజు. 
ప‌ద‌హైదేళ్లు గడిచిపోయాయి.
ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు. 
ఆ నవ్వుల రేడు…సంక్షేమసారధి లేడుగానీ ప్రజల జ్ఞాపకాల్లో  నిలిచిపోయాడు. జోహార్‌ వైయ‌స్ఆర్‌.

అమ‌రావ‌తి:  తెలుగు నేల‌పై చెర‌గ‌ని జ్ఞాప‌కం డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి..ఆ పేరే ఒక స్ఫూర్తి . వైయ‌స్ రాజశేఖరరెడ్డి.. అలియ‌స్ వైయ‌స్ఆర్‌.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా. అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తూ.. రూ.1,100 కోట్ల సేద్యపు విద్యుత్‌ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి.. వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. 

రూ.లక్ష కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి.. ఐదేళ్లలోలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత. పారదర్శక పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి.. 3 పోర్టు­­లు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత.. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.  

సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు వైయ‌స్ఆర్‌ 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలే. ఆ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇ­ళ్లు వంటి విప్లవాత్మక పథకాలు..  సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి వైపు ఎలా పరుగెత్తించవచ్చో దేశానికే చాటిచెప్పారు. 

మహా­నేత మరణించి 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైయ‌స్ఆర్‌  అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరున­వ్వు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పి­లిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయు­డు. వైయ‌స్ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రి నెలకొల్పి ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల ప్రేమాభిమానాలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్సార్‌ 1978లో రాజకీయ అరంగేట్రం నాటి నుంచి 2009 సెప్టెంబర్‌ 2న హెలికాఫ్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందేవరకూ తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు.    

వైయ‌స్ఆర్ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం
అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్‌ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్‌ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైయ‌స్ఆర్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 

సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచి్చన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమా­ణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు.

 వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.

YS Rajasekhara Reddy A legend Provided Welfare Schemes To Poor - Sakshi

ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట
⇒ 2004 మే 14 నుంచి 2007 జూన్‌ 26 వరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.168.52 కోట్లను విడుదల చేశారు. ఆ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బునపడ్డ పేద కుటుంబాలు ఆ ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసకు స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచి్చంది. 108, 104 అంబులెన్స్‌ సరీ్వసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ను చేపట్టింది. 

⇒ కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి, తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతోసహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు.   

⇒ కొన్ని ప్రైవేట్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో.. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా పొదుపు సంఘాల (డ్వాక్రా) వ్యవస్థలో విప్లవం తీసుకొచి్చంది.  

⇒ 2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్‌ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటిచేత్తో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. 

⇒ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని హైదరాబాద్‌ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదువులు దక్కేలా చేశారు

⇒ పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీసిటీ సెజ్‌తోసహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరి­గాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి.

 
తెలుగు ప్రజల గుండెల్లో తిరుగులేని నేత వైయ‌స్ఆర్  
వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి…ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. నిసత్తువలో ఉన్న కాంగ్రెస్ పార్టీని…పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన నాయకుడు. సంక్షేమంతోపాటు డెవలప్ మెంట్ ను పరుగులు పెట్టించిన జననేత. ఎన్నో సంక్షేమ పథకాలకు ఆద్యుడు. సింపుల్ గా చెప్పాలంటే…అసలు సిసలైన లీడర్. 13 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైయ‌స్ఆర్‌  అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అని ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో…నల్లమల అడవుల్లో ప్రాణాలు కోల్పోయారు. 

మండుటెండలో 1,475 కి.మీల ప్రజా ప్రస్థానం పాదయాత్రతో…కాంగ్రెస్ పార్టీ జీవం పోశారు. వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు ప్రాణం పోశారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అర్థం చేసుకుని… నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వైయ‌స్ఆర్‌ .. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పేదల కోసమే పని చేశారు. ఆయన ప్రజలకు దూరమై 13 ఏళ్లు పూర్తవుతున్నా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల మూడు నెలల కొద్ది కాలంలోనే…మరచిపోలేని సంక్షేమ పథకాలను అమలు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో సమగ్రాభివృద్ధి పెద్దపీట వేశారు. 

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి…వ్యవసాయ రంగానికి పెద్ద వేశారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే… రైతులకు ఉచిత కరెంట్ ఫైల్ మీదే సంతకం చేసి…ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మాట తప్పని నేతగా జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. 1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు. 2009 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుల్లేకుండా…ఒంటరిగా పోటీ చేసి…కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. 

YSR Death Anniversary: YSR Welfare Schemes Changed Fate Of Many People - Sakshi

భౌతికంగా దూరమైనా జనహృదయాల్లో కొలువు
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో అకాల మ‌ర‌ణం పొంది భౌతికంగా దూర‌మైనా ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా కొలువుదీరారు.   సెప్టెంబర్ 2 ఉదయం 8.35 గంటలకు రచ్చబండ కార్యక్రమానికి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. 9.27 గంటల సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉండగా వైయ‌స్ఆర్ ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్‌కి బేగంపేట్ విమానాశ్రయం, శంషాబాద్ విమానాశ్రయాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. రేడియో సిగ్నల్స్ కట్ అయ్యాయ్. నాలుగు మిలిటరీ హెలీక్యాప్టర్లు నల్లమల అటవీ ప్రాంతాన్ని అణువణువూ జల్లెడపట్టి నిరాశతో వెనుదిరిగాయి. వైయ‌స్ఆర్ చాపర్ ఆచూకీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఓ వ్యక్తి ఆచూకీ కోసం యుద్ధ విమానాన్ని ఉపయోగించడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్‌గా దేశ చరిత్రలో నిలిచిపోయింది.   

 

Best Web Hosting Provider In India 2024