Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ పుట్టిన రోజున రావాల్సిన అప్‍డేట్స్ అన్నీ క్యాన్సల్.. కారణం ఇదే

Best Web Hosting Provider In India 2024


Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, స్టార్ హీరో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ రేపు (సెప్టెంబర్ 2) తన 56వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సెలెబ్రేషన్లకు ఆయన అభిమానులు సిద్ధమయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రం మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. కాగా, పవన్ కల్యాణ్ హీరోగా లైనప్‍లో ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి ఆయన బర్త్ డే సందర్భంగా రేపు అప్‍డేట్స్ రావాల్సి ఉంది. అయితే, అవన్నీ క్యాన్సల్ అయ్యాయి.

వరదల వల్ల..

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. చాలా చోట్ల వరదలు వచ్చాయి. భారీ వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తన పుట్టిన రోజైన రేపు (సెప్టెంబర్ 2) ఎలాంటి సినిమా అప్‍డేట్లు ఇవ్వొద్దని మూవీ టీమ్‍లకు పవన్ కల్యాణ్ సూచించారని సమాచారం. అందుకే రేపు రావాల్సిన మూడు చిత్రాల అప్‍డేట్స్ రద్దయ్యాయి. పవన్ చిత్రాలపై ఏ అప్‍డేట్ రాదు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024