Deepika Padukone: కల్కి 2898 ఏడీ హీరోయిన్ డెలివరీ డేట్ ఫిక్స్.. బిడ్డకు జన్మనివ్వబోతోంది ఆ రోజే..

Best Web Hosting Provider In India 2024


Deepika Padukone: దీపికా పదుకోన్, రణ్ వీర్ సింగ్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. 2018 లో పెళ్లి చేసుకున్న ఈ స్టార్లు ఫిబ్రవరిలో స్వీట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ తొలి సంతానం రాబోతోందని ప్రకటించారు. అయితే తాజాగా న్యూస్ 18 రిపోర్ట్ ప్రకారం.. దీపిక డెలివరీ డేట్ సెప్టెంబర్ చివర్లో ఉంది. ఆమె ఇంతకుముందు అనుకున్నట్లు లండన్ లో కాకుండా ముంబైలోనే ప్రసవించే అవకాశం ఉంది.

దీపిక డెలివరీ డేట్ ఇదే

దీపిక పదుకోన్ సెప్టెంబర్ 28న బిడ్డకు జన్మనివ్వబోతోందని ఆ రిపోర్టు తెలిపింది. దీపిక, రణ‌్‌వీర్ తమ జీవితంలో రాబోయే కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, తమ బిడ్డ కోసం ఒక స్పేస్ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 28న దక్షిణ ముంబైలోని ఓ ఆసుపత్రిలో దీపిక ప్రసవించనుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పని నుంచి తీసుకున్న ప్రతి విరామాన్ని ఆస్వాదిస్తోంది.

మరో ఆరు నెలలు లీవ్

దీపిక పదుకోన్ సినిమా షూటింగులకు మరో ఆరు నెలలు దూరంగా ఉండనుంది. ఆమె మెటర్నిటీ లీవ్ కొనసాగనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగులను తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. రాబోయే కొన్ని నెలలను తన పుట్టబోయే బిడ్డ కోసం కేటాయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మెటర్నిటీ లీవ్ పూర్తి కాగానే.. ఆమె అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ లతో కలిసి కల్కి 2898 ఏడీ సీక్వెల్ చిత్రీకరణలో బిజీ అవుతారని సమాచారం. 2024 సెప్టెంబర్లో తమ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఫిబ్రవరిలో దీపిక, రణ్‌వీర్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటికే దీపిక ప్రెగ్నెంట్ అన్న పుకార్ల నేపథ్యంలో వీళ్లు ఈ అనౌన్స్‌మెంట్ చశారు.

దీపిక చివరిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లతో కలిసి నటించింది. ఈ ఏడాది నవంబర్ లొ విడుదల కానున్న రోహిత్ శెట్టి సింగం ఎగైన్ లోనూ ఆమె నటించింది. ఈ మూవీలో ఆమె భర్త రణ్‌వీర్ కూడా కనిపించనున్నాడు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024