పేద ప్రజల డాక్టర్ వైయ‌స్ఆర్‌

Best Web Hosting Provider In India 2024

కోడుమూరు నియోజక‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్ ఆదిమూలపు సతీష్  

క‌ర్నూలు:  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సంక్షేమ ప్రదాత… అభివృద్ధి విదాత, పేద ప్రజల డాక్టర్ అని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ కొనియాడారు. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో మహానేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి నేప‌థ్యంలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలతో అలంకరించి ఘనంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా స‌తీష్ మాట్లాడుతూ  ..భారతదేశం గర్వించదగ్గ మహా నాయకులు అన్నారు. మ‌హానేత అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ వైయ‌స్ జ‌గ‌న్ వెంట నిలుద్దామ‌ని, ప్ర‌జ‌ల క‌ష్టాల్లో తోడుగా నిలుద్దామ‌ని పిలుపునిచ్చారు. 
కార్యక్రమంలో జడ్పిటిసి ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షులు నెహమియా, గూడూరు జడ్పిటిసి మౌలాలి, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, ఎంపీటీసీ మద్దిలేటి, ఎంపీటీసీ కృష్ణ, ప్రతాప్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు డి వాసు, కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, సురేష్, రామకృష్ణ యాదవ్, పెద్ద భద్రారెడ్డి, చిన్న భద్రారెడ్డి, రేమట సంపత్ కుమార్, మాజీ ఎల్లమ్మ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, సురేష్,  రామకృష్ణ యాదవ్, మాజీ ఎల్లమ్మ బోర్డ్ మెంబర్ మధు శేఖర్, అల్లావుద్దీన్, శివుడు, ఎదురురు వెంకటేష్, పి. రుద్రవరం వెంకటేష్, దస్తగిరి, మాజీ సర్పంచ్ బజారి, పడిదంపాడు వెంకటేష్, మోహన్ బాబు, మక్బూల్ బాషా, ప్రసాదు, సంపత్ కుమార్, ఆదాము, ఎల్ల రాజు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Best Web Hosting Provider In India 2024