మ‌హానేత‌కు ఘ‌న నివాళులు

Best Web Hosting Provider In India 2024

రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు

సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

అమ‌రావ‌తి: మహానేత, దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు రాష్ట్ర‌వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.  నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి పూలమాలవేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో  మాజీ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.  

అనంత‌పురం జిల్లా..
  ఉమ్మడి అనంతపురం జిల్లాలో మ‌హానేత వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మ‌హానేత విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.  వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి 15 వర్దంతిని పురష్క‌రించుకుని స్థానిక 2వ రోడ్డు లోని వై.యస్.ఆర్.సి. పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారని, వారి భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీమతి మంగమ్మ , అనంతపురము మాజీ శాసన సభ సభ్యులు అనంత వెంకట రామి రెడ్డి , నగర పాలక మేయరు, డిప్యూటి మేయర్లు, కార్పొరేటర్లు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. 

Best Web Hosting Provider In India 2024