Best Web Hosting Provider In India 2024
OTT Romantic Movie: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ టీనేజీ లవ్ స్టోరీ రానుంది. ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న ఈ సినిమా పేరు సత్య. మే 10న థియేటర్లలో రిలీజైన ఈ తమిళ డబ్బింగ్ మూవీ.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ విసయాన్ని ఆహా ఓటీటీ సోమవారం (సెప్టెంబర్ 2) తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది.
సత్య ఓటీటీ రిలీజ్ డేట్
26 ఏళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించిన గ్యాంగ్‌స్టర్ మూవీ సత్య తెలుసు కదా. కొన్నాళ్ల కిందట అదే పేరుతో తెలుగులో మరో సినిమా వచ్చింది. అయితే ఇది దానికి పూర్తి భిన్నమైన జానర్ టీనేజీ లవ్ స్టోరీ కావడం విశేషం. తమిళంలో రంగోలి పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో సత్యగా రిలీజ్ చేశారు.
సత్య మూవీ కథేంటి?
సత్య మూవీని తెలుగులోకి శివ మల్లాల తీసుకొచ్చాడు. వాలీ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్థన సందీప్, మురగదాస్, సాయిశ్రీ నటించారు. మే 10న తెలుగులో ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. అంతకుముందే తమిళంలో మంచి హిట్ కావడంతో చిన్న సినిమానే అయినా తెలుగులోనూ తీసుకొచ్చారు. ఫొటో జర్నలిస్టు అయిన శివ మల్లాల తెలుగులో సత్య పేరుతో మూవీని రిలీజ్ చేశాడు.
సత్య మూవీ ఓ టీనేజీ లవ్ స్టోరీ. ఇష్టం లేక తండ్రి కోరిక మేరకు ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదవడానికి వెళ్లే సత్య.. అక్కడ పార్వతి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతున్నా బయటకు మాత్రం చెప్పదు. కానీ అనూహ్యంగా ఓ రోజు అతన్నే చెంపదెబ్బ కొడుతుంది. దీంతో అతడు ఆ కాలేజీని వదిలేసి తన కుటుంబం కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అసలు ఆ నిర్ణయం ఏంటి? తర్వాత ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఏమవుతుంది అన్నదే సత్య మూవీ కథ.
ఈ టీనేజీ లవ్ స్టోరీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు వచ్చే శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి సందర్భంగా ఆహా ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits