Best Web Hosting Provider In India 2024
నేచురల్ స్టార్ నాని హ్యాట్రిక్స్ హిట్స్ కొట్టేశారు. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో సక్సెస్ సాధించారు నాని. తాజాగా ‘సరిపోదా శనివారం’ చిత్రం కూడా బ్లాక్‍బస్టర్ దిశగా సాగుతోంది. గత నెల (ఆగస్టు) 29న రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‍తో భారీ వసూళ్లను సాధిస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కలెక్షన్లలో ఇంకా జోరు కొనసాగిస్తోంది. కాగా, నాని తదుపరి దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నారు.
గతేడాది నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‍లో మాస్ యాక్షన్ చిత్రం దసరా వచ్చింది. ఈ చిత్రం భారీ హిట్ కొట్టింది. తొలి చిత్రంతో సక్సెస్ అయ్యారు ఓదెల. వీరి కాంబోలో రెండో చిత్రం కూడా వస్తోంది. ఈ మూవీనే నాని తదుపరి చేయనున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఈ చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వస్తున్నాయి. కథ అదేనని, మూవీ ఇలా ఉంటుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 2) స్పందించింది.
ఎంతో జాగ్రత్తతో తీసుకొస్తాం
నాని – ఓదెల ప్రాజెక్ట్ గురించి ఎలాంటి రూమర్లు వ్యాప్తి చేయవద్దని, దీనివల్ల ఎగ్జైట్‍మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుందని మూవీ టీమ్ సూచించింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎస్‍ఎల్‍వీ సినిమాస్ ఈ మేరకు సోషల్ మీడియాలో నేడు ఓ నోట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రం నుంచి తము తీసుకొచ్చే ప్రతీ అప్‍డేట్, కంటెంట్ బెస్ట్‌గా ఉండేలా చాలా జాగ్రత్తతో తీసుకొస్తామని తెలిపారు.
లీక్స్, రూమర్లు వద్దు
నాని – ఓదెల చిత్రాన్ని ప్రతీష్టాత్మకంగా రూపొందిస్తున్నామని, ఈ చిత్రం గురించి ఎలాంటి లీక్స్, రూమర్లు వ్యాప్తి చేయవద్దని మూవీ టీమ్ కోరింది. ఇలాంటివి చూస్తున్నప్పుడు బాధగా ఉంటోందని పేర్కొంది. “నానిఓదెల్ 2 ప్రాజెక్ట్ మాకు చాలా ప్రతిష్టాత్మకమైనది. అలాగే ఇండియన్ సినిమాలో మోస్ట్ యాంటిసిపేటెడ్‍గా ఉంటుంది. ఇలాంటి చిత్రంపై రూమర్లు, లీక్‍లు వస్తుండటం చాలా బాధగా అనిపిస్తోంది. ఇలాంటివి సినిమాపై ఎగ్జైట్‍మెంట్ చంపేస్తాయి” అని మూవీ టీమ్ పేర్కొంది.
వాటిలో నిజం లేదు
ఈ మూవీని బెస్ట్‌గా ఇచ్చేందుకు నిరంతరం శ్రమిస్తామని టీమ్ వెల్లడించింది. ఫేక్ న్యూస్, రూమర్లు, లీక్‍లను ఎవరూ వ్యాప్తి చేయవద్దని కోరింది. అనధికారింగా ఇప్పటి వరకు బయటికి వచ్చిన సమాచారంలో నిజం లేదని మూవీ టీమ్ తెలిపింది. తమ నుంచి ఈ చిత్రంపై అప్‍డేట్స్ వస్తాయని స్పష్టం చేసింది.
నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్‌గానే ఉండనుంది. ఈ చిత్రంపై మార్చిలోనే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు ఓదెల ప్రస్తుతం బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదని తెలుస్తోంది. నాని లైనప్‍లో హిట్ 3 మూవీ కూడా ఉంది. దీంతో ఈ రెండింట్లో ఏది ముందుగా పూర్తవుతుందో చూడాలి.
Best Web Hosting Provider In India 2024
Source / Credits