Hyderabad : హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్.. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బదిలీ.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

Best Web Hosting Provider In India 2024


తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీలు చేసింది. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌ను నియమించింది. హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీవీ ఆనంద్ గతంలో కూడా హైదరాబాద్ సీపీగా పనిచేశారు. రెండేళ్ల పాటు హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగాను.. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌టిష్టంగా ఉంచాం.. అది వృత్తిప‌రంగా చాలా సంతృప్తిని ఇచ్చింద‌ని సీవీ ఆనంద్ గతంలో వ్యాఖ్యానించారు. ఒకేసారి అన్ని ర‌కాల పండుగ‌లు వ‌చ్చినా.. ఎక్క‌డా కూడా మ‌త సామ‌ర‌స్యం దెబ్బ‌తిన‌కుండా ప్రశాంతంగా పండుగ‌ల‌ను నిర్వ‌హించామ‌న్నారు. సైబ‌ర్ క్రైమ్‌లో గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని నేరాల‌ను చూశామని.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని సీవీ ఆనంద్ వివరించారు.

2023 డిసెంబర్ 23న తెలంగాణ ఏసీబీ డీజీగా.. సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్పటి నుంచి ఎందరో అవినీతి అధికారుల ఆట కట్టించారు. ఏసీబీ నుంచి మళ్లీ ఆయన్ను హైదరాబాద్ సీపీగా బదిలీ చేశారు. సీవీ ఆనంద్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన సమయంలో.. ఎన్నో కీలక కేసుల్లో కీలకంగా వ్యవహారించారు. ఎలాంటి ఒత్తిడికి తలొగ్గని అధికారిగా సీవీ ఆనంద్‌కు పేరుంది. గత ప్రభుత్వంలోనూ సీవీ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.

టాపిక్

HyderabadTs PoliceTelangana NewsIps OfficersHyderabad Traffic

Source / Credits

Best Web Hosting Provider In India 2024