35 OTT Platform: ఓటీటీని ఫిక్స్ చేసుకున్న నివేదా థామస్ ఫీల్‍గుడ్ సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో వస్తుందంటే..

Best Web Hosting Provider In India 2024


నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్ర పోషించిన ‘35 – చిన్న కథ కాదు’ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ప్రమోషన్లలోనూ ఈ మూవీపై టీమ్ సభ్యులంతా నమ్మకం వ్యక్తం చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నేచురల్ స్టార్ నాని కూడా ప్రశంసలు కురిపించారు. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్లతోనే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న 35 – చిన్న కథ కాదు చిత్రం ఈ శుక్రవారం (సెప్టెంబర్ 6) థియేటర్లలో రిలీజ్ అయింది.

ఓటీటీ పార్ట్‌నర్‌ లాక్

35 – చిన్నకథ కాదు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రాన్ని మంచి ధరతో ఆహా ఓటీటీ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మూవీ శాటిలైట్ టెలికాస్ట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ దక్కించుకుందని సమాచారం.

35 – చిన్నకథ కాదు చిత్రానికి నందకిశోర్ ఇమానీ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఫీల్ గుడ్ చిత్రంగా ఈ మూవీన తెరకెక్కించారు. సింపుల్ కథను హృదయాలకు హత్తుకునేలా చూపించారు. దీంతో ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన దక్కించుకుంటోంది. నివేదా థామస్, విశ్వదేవ్‍తో పాటు ప్రియదర్శి కూడా మెయిన్ రోల్ చేశారు. అనుదేవ్ పోతుల, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అభయ్, అనన్య కీలకపాత్రలు పోషించారు.

సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా సమర్పించడం కూడా 35 – చిన్నకథ కాదు మూవీకి మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమా కూడా బాగుండటంతో అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీని సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు.

35 – చిన్నకథ కాదు మూవీకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా బలంగా నిలిచింది. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేశారు. తిరుపతి బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ మూవీలో విజువల్స్ కూడా సహజంగా, ఆకట్టుకునేలా మేకర్స్ చూపించారు.

35 – చిన్నకథ కాదు స్టోరీలైన్

సరస్వతి (నివేదా థామస్), ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉంటారు. తిరుపతిలో నివసించే మధ్య తరగతి కుటుంబం వీరిది. వీరి చిన్న కుమారుడు వరుణ్ (అభయ్ శంకర్) చదువులో బాగానే ఉన్నా.. పెద్దోడు అరుణ్ (అరుణ్‍దేవ్ పోతుల)కు మ్యాథ్స్ నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. లెక్కల గురించి ఉపాధ్యాయుడు చాణక్య వర్మ (ప్రియదర్శిని)ని అసాధారణమైన ప్రశ్నలు అడుగుతుంటాడు అరుణ్. అయితే, అరుణ్‍ను జీరో అని చాణక్య అంటుండటంతో సరస్వతి, ప్రసాద్ ఆందోళన పడుతుంటారు. ఆ స్కూల్‍లో ఉండాలంటే మ్యాథ్స్ సబ్జెక్టులో అరుణ్ తప్పనిసరిగా 35 మార్కులు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత తల్లి సరస్వతి ఏం చేశారు? తన కుమారుడు లెక్కలను నేర్పించారా? అరుణ్ 35 మార్కులు తెచ్చుకున్నాడా అనే అంశాలు ఈ 35 – చిన్నకథ కాదు చిత్రంలో ఉంటాయి. ఈ మూవీని నందకిశోర్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను బాగా మెప్పించింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024