Mathu Vadalara 2 – Prabhas: ‘మత్తువదలరా 2’ ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్.. తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తున్న సినిమా

Best Web Hosting Provider In India 2024


దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా చేసిన తొలి మూవీ ‘మత్తువదలరా’ మంచి హిట్ అయింది. ఈ చిత్రం నటుడిగా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. యమదొంగ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సింహా.. ఆ తర్వాత మళ్లీ 2019లో మత్తువదలరా మూవీతో తెరపై కనిపించారు. ఆ మూవీ హిట్ అయినా.. ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలతో శ్రీసింహాకు నిరాశ ఎదురైంది. అయితే, సూపర్ హిట్ అయిన మత్తువదలరా చిత్రానికి ఐదేళ్ల తర్వాత సీక్వెల్ వస్తోంది. ‘మత్తువదలరా 2’ చిత్రం సెప్టెంబర్ 13న రానుంది. ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి.

మత్తువదలరా 2 సినిమా ట్రైలర్ రిలీజ్‍కు డేట్, టైమ్‍ ఖరారైంది. ఈ చిత్రం సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ తక్కువ రన్‍టైమ్‍తోనే వస్తోంది. ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు.

ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్

మత్తువదలరా 2 సినిమా ట్రైలర్ రేపు (సెప్టెంబర్ 8) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రానుంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ రిలీజ్ చేయనుండటంతో మరింత హైప్ ఏర్పడింది. సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఈ ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

శ్రీసింహ, సత్యతో కారులో ప్రభాస్ కూర్చున్నట్టు ఫొటోను మత్తువదలరా 2 టీమ్ క్రియేట్ చేసింది. ఈ పోస్టర్‌తో ట్రైలర్ టైమ్‍ను రివీల్ చేసింది. “రెబల్ ఫోర్స్ నుంచి ఈ గ్యాంగ్‍కు పెద్ద సపోర్ట్ దక్కింది. మత్తువదలా 2 ట్రైలర్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు ప్రభాస్ లాంచ్ చేయనున్నారు” అని ఈ మూవీని నిర్మిస్తున్న క్లాప్ ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది.

తక్కువ రన్‍టైమ్‍తో..

మత్తువదలరా 2 సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింద సెన్సార్ బోర్డు. ఈ మూవీ 2 గంటల 19 నిమిషాల (139 నిమిషాలు) రన్‍టైమ్‍తో రానుందని తెలుస్తోంది. దీంతో కాస్త క్రిస్ప్‌గా తక్కువ రన్‍టైమ్‍తోనే ఈ మూవీ వస్తోంది. క్రైమ్ కామెడీ చిత్రానికి ఈ రన్‍టైమ్ ప్లస్‍గానే ఉండే అవకాశం ఉంది.

మత్తువదలరా 2 సినిమాలో శ్రీసింహా, సత్య లీడ్ రోల్స్ చేశారు. వెన్నెల కిశోర్, ఫారియా అబ్దుల్, సునీల్, రోహిణి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సింహా, సత్య మరోసారి కామెడీతో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లోని మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మత్తువదలరా 2 టీమ్ ప్రమోషన్లను కూడా విభిన్నంగా చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్టులతో వీడియోలు చేస్తోంది. కాగా, ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్‍ను హీరోయిన్ ఫారియా అబ్దుల్లా రచించటంతో పాడారు. ఈ మూవీని డైరెక్టర్ రితేశ్ రానా తెరకెక్కించారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‍మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి, పెదమల్లు, హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024