Bigg Boss 8 Telugu: అలా అయితే హౌస్‍లో ఉండవు: మణికి నాగార్జున వార్నింగ్.. ఐదుగురు ఫ్లాఫ్.. సోనియా – విష్ణు మధ్య క్లాష్

Best Web Hosting Provider In India 2024


బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ రసవత్తరంగా జరిగింది. నేడు (సెప్టెంబర్ 7) జరిగిన ఈ శనివారం ఎపిసోడ్‍లో కొందరు కంటెస్టెంట్లను హోస్ట్ కింగ్ నాగార్జున నిలదీశారు. ఫస్ట్ వీక్‍లో ఐదుగురు కంటెస్టెంట్లు నిరాశపరిచారని, వారు ఫ్లాఫ్ అయ్యారని చెప్పారు. ఇక సోనియాతో గొడవ విషయంలో విష్ణుప్రియకు కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. అలాగే, నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో ఒక్కరే సేఫ్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్ ఎలా జరిగిదంటే..

వినాయక చవితి సందర్భంగా ‘ధన్ ధనాధన్ దరువెయ్ రా’ అనే పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆరో రోజు ఆటను టీవీలో చూపించారు. కిచెన్ విషయంలో నిఖిల్, బేబక్క, మణికంఠ మధ్య మాటలు గట్టిగానే నడిచాయి.

సోనియా, విష్ణుప్రియ మధ్య ఫైట్

నిఖిల్ నచ్చలేదని ముందు చెప్పావని, అయితే ఇప్పుడు బాగా కుదిరినట్టు ఉంది అంటూ సోనియాతో విష్ణుప్రియ అన్నారు. దీంతో సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. అడల్ట్ రేటెడ్ కామెడీ వద్దని విష్ణుతో సోనియా అన్నారు. కాసేపటికి సోనియాతో మళ్లీ వాదనకు దిగారు విష్ణు. అభ్యంతరకంగా చేతులతో సంజ్ఞలు చేశారు. దీంతో సోనియా ఫైర్ అయ్యారు. అడల్ట్ రేటెడ్ కామెడీ అనడం కరెక్ట్ కాదని విష్ణు వారించారు. అమెదొక పర్సనాలిటీ అంటూ వ్యక్తిగతంగా విష్ణు అటాక్ చేశారు. దీంతో సోనియా ఏడ్చేశారు. నవీన్ ఓదార్చారు. “ఈమె ఒక్కరే పుణ్యస్త్రీ.. మేం ఇలాంటి వాళ్లమా” అంటూ విష్ణు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడారు. అందరికీ హ్యాపీ వినాయక చవితి చెప్పారు. స్వీట్స్ పంపారు. ఈసారి వీకెండ్ ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లే ముందుగా జడ్జిమెంట్ చెప్పాలని నాగ్ అన్నారు. కంటెస్టెంట్లు డాగర్స్ కట్టుకోగా.. అభ్యంతరాలు ఉన్న వారు కత్తి గుచ్చి వారి కంప్లైట్ చెప్పాలని అన్నారు.

విష్ణుపై నాగ్ అసంతృప్తి

సోనియాకు కత్తి గుచ్చారు విష్ణుప్రియ. ఆమె అనవసరంగా నెగెటివ్ చేయాలని ప్రయత్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. నిఖిల్‍కు దగ్గరవుతున్నావని సోనియాను సరదాగా అన్నానని, దానికి అడల్ట్ కామెడీ అంటూ సోనియా అనడం కరెక్ట్ కాదని విష్ణు చెప్పారు. అయితే, సోనియా బాధపడుతున్నా కఠినమైన కామెంట్లు చేయడం, పుణ్యస్త్రీ లాంటి పదాలు వాడడం పట్ల విష్ణుపై నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. “నువ్వు అమ్మాయివే కదా, అర్థం చేసుకోవాలి” అని అన్నారు. అన్ని కుక్కర్లు ఒకేలా పని చేయవని, అందరి ఎమోషన్లు ఒకేలా ఉండవని సోనియాతో నాగ్ చెప్పారు.

మణికంఠ నెగెటివ్‍గా ఉన్నారని శేఖర్ బాషా అతడికి కత్తిగుచ్చారు. యష్మి తన క్లాన్‍కు అంత పని ఇవ్వడం కరెక్ట్ కాదని నైనిక చెప్పి.. కత్తి గుచ్చారు. నిఖిల్ క్లాన్‍లో ఉండనని బేబక్క తెగేసి చెప్పారు. దీంతో బ్యాండ్ తీసేయాలని బేబక్కతో నాగార్జున అన్నారు. సోనియా కావాలని నిఖిల్ అన్నాడని బేబక్క తెలిపారు. ఎదుటి వారు ఫీలవుతున్నారని నిఖిల్ అడ్జస్ట్ అవడం తనకు నచ్చడం లేదని కారణం చెప్పారు అభయ్. మేజర్ చీఫ్ అయినప్పుడు యష్మి గౌడ తీరు సరిగా లేదని చెబుతూ ఆమెకు కత్తి గుచ్చారు కిర్రాక్ సీత. మానవత్వం లేకుండా యష్మి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అయితే, అదే ఆట అంటూ నాగార్జున చెప్పారు.

ఫుడ్ తయారీ విషయంలో బేబక్కకు సోనియా కత్తి గుచ్చారు. నిఖిల్‍.. నోరు తుడుచుకో అని కామెంట్ చేయడం తనకు నచ్చలేదని నబీల్ ఆఫ్రిది చెప్పారు. హౌస్ విషయాల్లో యాక్టివ్‍గా ఆదిత్య ఓం కల్పించుకోవడం లేదని ప్రేరణ కారణం చెప్పారు. యష్మికి కత్తిని గుచ్చారు మణికంఠ. ఆదిత్యకు పృథ్విరాజ్, మణికి యష్మి కత్తిని గుచ్చి వారి కారణాలు చెప్పారు.

మణికంఠకు వార్నింగ్

మణికంఠకు నెగెటివిటీ ఎక్కువగా ఉందని యష్మి చెప్పారు. ఈ విషయంలో నాగార్జున కల్పించుకున్నారు. హౌస్‍లో ఇక ఎమోషనల్‍గా ఉండకూడదని, ఆట ఆడకపోతే హౌస్‍లో ఉండలేవని మణికంఠకు నాగ్ వార్నింగ్ ఇచ్చారు. “ఈ వీక్ తను చాలా ఎమోషనల్‍గా ఉన్నాడు. అప్పుడు ఏం మైండ్‍లోకి వెళ్లదు. మణికంఠ ఈవారంతో నీ బాధ అయిపోయిందని అనుకుంటున్నా. ఇక పక్కన పెట్టు. ఇక నుంచి నువ్వు ఆటలో లేకపోతే హౌస్‍లో ఉండవు. నేను కాదు చెప్పేది.. ఆడియన్స్ అది చేస్తారు. స్ట్రాంగ్ పీపుల్, విన్నర్స్ అంటే అందరికీ ఇష్టం. దాని నుంచి నువ్వు బయటికి రావాలి” అని నాగార్జున అన్నారు.

ఐదుగురు కంటెస్టెంట్లు ప్లాఫ్

బిగ్‍బాస్ 8 తొలి వారం హౌస్‍లో ఐదుగురు కంటెస్టెంట్లు ప్లాఫ్ అయ్యారని నాగార్జున చెప్పారు. అంటే వారికి 35 శాతం కంటే స్కోరు తక్కువగా వచ్చిందని, 65 శాతానికి పైగా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. వారి మాస్కులను సుత్తితో బద్దలుకొట్టారు. ప్రేరణ, కిర్రాక్ సీత, బేబక్క, ఆదిత్య ఓం, విష్ణుప్రియ ప్లాఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. వారి మాస్కులు పగులగొట్టారు.

సోనియా సేఫ్

ఈ సీజన్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం శేఖర్ బాషా, బేబక్క, విష్ణుప్రియ, మణికంఠ, సోనియా, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. అయితే, వీరిలో సోనియా ఒక్కరే శనివారం సేఫ్ అయ్యారు. శేఖర్ బాషా, బేబక్క, పృథ్విరాజ్, మణికంఠ, విష్ణుప్రియ మధ్య ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ సాగనుంది. బేబక్క ఎలిమినేట్ అవుతారనే రూమర్లు ఉన్నాయి. ఆ విషయం రేపటి ఆదివారం ఎపిసోడ్‍లో తేలుతుంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024