Best Web Hosting Provider In India 2024
Re Release Movies: తెలుగులో రీ రిలీజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్నాయి. కోట్లలో కలెక్షన్స్‌ను రాబడుతోన్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్ కమర్షియల్‌గా వర్కవుట్ కావడంతో నిర్మాతలు పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోన్నారు. నెక్స్ట్ వీక్‌లో రెండు సూపర్ హిట్ మూవీస్ తెలుగు ప్రేక్షకుల ముందుకురాబోతున్నాయి.
మరోసారి థియేటర్లలోకి బొమ్మరిల్లు…
తెలుగు కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ బొమ్మరిల్లు మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ 21న ఈ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్, జెనిలీయా హీరోహీరోయిన్లుగా నటించారు. భాస్కర్ దర్శకత్వం వహించాడు.
దిల్‌రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ 2007లో థియేటర్లలో రిలీజైంది. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు మూవీగా నిలిచింది. కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 36 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. ఆ ఏడాది ఏడు నంది అవార్డులను సొంతం చేసుకున్నది.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్…
బొమ్మరిల్లు సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. పాటలు పెద్ద హిట్టయ్యాయి. బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్‌రాజ్, జయసుధ కీలక పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల ఎమోషన్‌కు లవ్‌స్టోరీని జోడిస్తూ డైరెక్టర్ భాస్కర్ బొమ్మరిల్లు మూవీని తెరకెక్కించాడు.
సిద్ధార్థ్ ప్రకాష్ రాజ్ యాక్టింగ్, జెనిలీయా కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తెలుగులో ట్రెండ్‌సెట్టర్ మూవీస్‌లో ఒకటిగా బొమ్మరిల్లు నిలిచింది. సిద్ధార్థ్‌కు లవర్‌బాయ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.బొమ్మరిల్లు మూవీ తమిళ్, బెంగాళీ, హిందీతో పాటు పలు భాషల్లోకి రీమేకైంది.
జర్నీ రీ రిలీజ్ డేట్ ఇదే…
శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ డబ్బింగ్ మూవీ జర్నీ తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ 21న జర్నీ మూవీ తెలుగులో రీ రిలీజ్ కాబోతోంది. లక్ష్మీ నరసింహ మూవీస్ సంస్థ మరోసారి ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
రెండు ప్రేమ కథలతో దర్శకుడు శరవణన్ జర్నీ మూవీని తెరకెక్కించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ జర్నీ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. తమిళంలో ఎంగేయుమ్ ఎప్పోదుమ్ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. జర్నీ మూవీతోనే అంజలి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. జై, అంజలి తమ కెమిస్ట్రీతో అభిమానులను ఆకట్టుకున్నారు
జర్నీ రీ రిలీజ్‌కు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. దాదాపు వందకుపైగా థియేటర్లలో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits