Best Web Hosting Provider In India 2024
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 తెలుగు ఈ వీకెండ్ ఎపిసోడ్‌లోకి నాగార్జున స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. సరిపోదా శనివారం సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశాడు. శుక్రవారం హౌజ్‌లో ఏం జరిగిందో నాగార్జున చూశాడు. మణికంఠ కారం ప్యాకెట్ దాచేశాడు. ఆ కారం పొడిని విష్ణుప్రియ దొంగిలించిందంటూ ప్రేరణ ఆమెతో గొడవపడింది. విష్ణుప్రియ దగ్గర ఉన్న రేషన్ మొత్తం తీయమని చెప్పింది. చివరకు తాను దాచిన కారం ప్యాకెట్‌ను మణికంఠ తీసి ఇచ్చాడు.
విష్ణుప్రియ ఫైర్…
ఫన్ కోసం మణికంఠ చేసిన పని సీరియస్ కావడంతో అతడిపై విష్ణుప్రియ ఫైర్ అయ్యింది. యష్మి టీమ్‌ను ఆడుకోవడానికి కారం దాచేసినట్లు మణికంఠ క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా ఫన్ అంటూ విష్ణు కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ అతడి మాటల్నివిష్ణు పట్టించుకోలేదు. ఇంకోసారి కొట్టేసి తిరిగి ఇవ్వడం చేయద్దని మణికంఠకు విష్ణుప్రియ క్లాస్ ఇచ్చింది. విష్ణుప్రియ గేమ్‌ను అగ్రెసివ్‌గా తీసుకుంటున్నదంటూ అభయ్ నవీన్ కంప్లైంట్ ఇచ్చాడు.
గన్‌తో నాగార్జున…
నాగార్జున గన్‌తో కనిపించడంతో కంటెస్టెంట్స్ భయపడ్డారు.నిఖిల్, నైనిక, యష్మి ముగ్గురు చీఫ్స్‌ను నాగార్జున నిల్చొమని చెప్పాడు. మీ క్లాన్స్ పర్ఫార్మెన్స్ను మీరే చెప్పారంటూ టాస్క్‌లు ఇచ్చాడు. రెడ్, గ్రీన్ కలర్స్ ఆధారంగా మార్కులు ఇవ్వాలని అన్నాడు. యష్మి మొదట అభయ్‌కి గ్రీన్ కలర్ ఇచ్చింది యష్మి.
అభయ్ టాస్క్‌లు బాగా ఆడాడని యష్మి అన్నది. అభయ్ టాస్క్‌లో పక్షపాతంగా వ్యవహరించాడని, ఉద్దేశపూర్వకంగా తనను తోసేశాడని విష్ణుప్రియ అభయ్ తప్పులను నాగార్జునతో చెప్పింది. సాక్ష్యంగా వీడియో చూపించాడు నాగ్. అందులో విష్ణు ఆరోపణలు అబద్దమని తేలింది.
పృథ్వీకి వార్నింగ్…
పృథ్వీకి కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చింది యష్మి. కానీ పృథ్వీ ఆటలో ఆవేశం ఎక్కువగా కనిపిస్తుందని నాగార్జున క్లాస్ ఇచ్చాడు. కొన్ని వాడకూడని పదాలు వాడుతున్నావని, నోరును అదుపులో పెట్టుకోమని అన్నాడు. ఇదే లాస్ట్ వార్నింగ్ పృథ్వీతో చెప్పాడు నాగార్జున
రెస్పెక్ట్ లేదు…
ప్రేరణకు మాత్రం రెడ్ కార్డ్ ఇచ్చింది యష్మి. ఆమె ఆటలో కన్ఫ్యూజన్ ఎక్కువగా కనిపిస్తుందని యష్మి కంప్లైంట్ ఇచ్చింది. బిగ్‌బాస్‌లో తనకు రెస్పెక్ట్ లేదని ప్రేరణ ఎమోషనల్ అయ్యింది. సోనియా వ్యక్తిగతంగా సరిగ్గా గేమ్ ఆడటం లేదన్న యష్మి ఆమెకు కూడా రెడ్ కార్డ్ ఇచ్చింది. ఫుడ్ షేరింగ్‌తో పాటు యష్మి తీసుకున్న విషయాల్లో తాను హర్ట్ అయినట్లు సోనియా అన్నది.
హౌజ్‌లో ఎక్కువగా ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతున్నావంటూ సోనియాలోని తప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. విష్ణుప్రియను ఉద్దేశించి సోనియా నోరుజారిన మాటల్ని నాగార్జున వీడియో ద్వారా చూపించాడు. మాట అదుపులో పెట్టుకోవడం అవసరం అంటూ క్లాస్ ఇచ్చాడు. అవతలి వాళ్ల గురించి చాలా విషయాల్లో తప్పుగా మాట్లాడుతున్నావని వార్నింగ్ ఇచ్చాడు. ఇలాగే ఉంటే ఆడియెన్స్ దృష్టిలో కిందపడిపోతావని నాగార్జున అన్నాడు.
శేఖర్ బాషాకు గుడ్‌న్యూస్…
ఫస్ట్ వీక్‌లో ఉన్న శేఖర్ బాషా సెకండ్ వీక్‌లో డల్ అయ్యాడని యష్మి కంప్లైంట్ చేసింది.శేఖర్ కు బాబు పుట్టాడనే గుడ్‌న్యూస్‌ను నాగార్జున వినిపించాడు. నాగార్జున చెప్పిన మాట వినగానే శేఖర్ బాషా ఎమోషనల్ అయ్యాడు. చివరగా తన ఫొటోను కూడా రెడ్‌లోనే పెట్టింది యష్మి. ఈ వీక్ తాను డౌన్ అయ్యానని యష్మి అన్నది. మిగిలిన రెండు క్లాన్స్‌లో నబీల్ బెస్ట్ అంటూ యష్మి చెప్పింది.
సీత హ్యాపీ…
నైనిక తన క్లాన్ లోని నబీల్, విష్ణుప్రియ, సీతలకు గ్రీన్‌కార్డ్ ఇచ్చింది. ఆదిత్యకు రెడ్‌కార్డ్ ఇచ్చింది నైనిక. ఆదిత్య ఇరిటేషన్ వల్లే తాము టాస్కుల్లో ఓడిపోయినట్లు నైనిక చెప్పింది. నైనికకు సారీ చెప్పాడు ఆదిత్య. మిగిలిన వారితో ఉన్న ఏజ్ గ్యాప్ కారణంగానే కొన్ని చెప్పలేకపోతున్నట్లు ఆదిత్య ఓం అన్నాడు. సీత టాస్క్‌లు బాగా ఆడిందని మెచ్చుకున్నాడు.
యష్మి కన్నీళ్లు…
మణికంఠకు అదర్ క్లాన్స్‌లో బెస్ట్ పర్ఫార్మర్గా చెప్పింది నైనిక. ప్రొఫెషనల్ థీఫ్ అంటూ అతడిపై సరదాగా కామెంట్స్చేసింది. . హౌజ్‌లో ఇంకోసారి అలగొద్దని, నవ్వుతూనే ఉండాలని మణికంఠకు సలహా ఇచ్చాడు నాగార్జున. మణికంఠ విషయంలో యష్మి చేసిన తప్పును నాగార్జున వీడియో చూపించాడు. ఆ వీడియో చూడగానే యష్మి కన్నీళ్లు పెట్టుకున్నది.
నిఖిల్‌కు గ్రీన్ కలర్…
నిఖిల్ క్లాన్‌పై నాగార్జున ప్రశంసలు కురిపించాడు. ఇద్దరే ఉన్నా అద్భుతంగా పోరాడుతున్నారంటూ మెచ్చుకున్నాడు. నిఖిల్‌కు గ్రీన్ కలర్ ఇచ్చాడు నిఖిల్. మణికంఠ మూడ్ సడెన్‌గా మార్చుకుంటున్నాడంటూ చెప్పాడు. నిఖిల్ ఫొటోను నాగార్జున గ్రీన్ కలర్ పెట్టమంటూ చూపించాడు. నిఖిల్ ఆటతీరు బాగుందని మెచ్చుకున్నాడు. ఎమోషన్స్‌ను కంట్రోల్స్ చేసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. మిగిలిన క్లాన్స్‌లో బెస్ట్ పర్ఫార్మర్ సీత అంటూ నిఖిల్ చెప్పాడు.
యష్మి, నైనిక క్లాన్స్ రద్దు…
ఆ తర్వాత చీఫ్లుగా నైనిక, యష్మి ఫెయిలయ్యారని నాగార్జున అన్నాడు. వారి క్లాన్స్‌ను రద్దు చేశాడు. ఇక నుంచి హౌజ్‌లో నిఖిల్ మాత్రమే ఛీఫ్ అని నాగార్జున ప్రకటించాడు. రేషన్ విషయంలో మీరిద్దరు సీరియస్‌గా లేరంటూ అన్నాడు. ఆ తర్వాత కొత్త చీఫ్‌గా ఎంపిక విషయంలో ఓటింగ్ పెట్టాడు. ఇందులో అభయ్‌కి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అభయ్ కొత్త చీఫ్‌గా ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించాడు.ఆ తర్వాత నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో ఎలిమినేషన్ నుంచి నైనిక, నిఖిల్ సేఫ్ అయ్యారు. మిగిలిన ఆరుగురు అన్ సేఫ్‌గా నిలిచారు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits