Best Web Hosting Provider In India 2024
OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతోంది. ఇదొక తమిళ సినిమా. పేరు కాఫీ. నవంబర్, 2022లో థియేటర్లలో కాకుండా నేరుగా టీవీలోనే రిలీజైంది. రెండేళ్ల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. కనిపించకుండాపోయిన తన తమ్ముడి కోసం ఓ అక్క చేసే పోరాటంతో తెరకెక్కిన ఈ సినిమా ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కాఫీ ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాఫీ వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ మంగళవారం (సెప్టెంబర్ 17) ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “యాక్షన్ తో కూడిన కాఫీ ఇది. ఆహా తమిళంలో కాఫీ సెప్టెంబర్ 20న ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.
కాఫీ మూవీ కథేంటంటే..
కాఫీ మూవీలో తమిళ నటి ఇనేయా లీడ్ రోల్లో నటించింది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. విచిత్రంగా థియేటర్లలో కాకుండా 2022లో టీవీలోనే ప్రీమియర్ షో వేశారు. తన చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయిన ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కావాలని కల కంటుంది.
తన కల నెరవేర్చుకోవడానికి చేరువైన సమయంలో అనుకోకుండా తన తమ్ముడిని మిస్ అవుతుంది. అతన్ని కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేస్తుంది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లు ఏంటి అన్న కథతో ఈ కాఫీ మూవీ తెరకెక్కింది. సాయి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 27, 2022లో నేరుగా కలర్స్ తమిళ్ లో ప్రీమియర్ అయింది.
నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ కాఫీ మూవీని తెరకెక్కించారు. ఉద్యోగాల పేరుతో యువతను ఎలా మోసం చేస్తున్నారన్న క్రైమ్ ను ఈ సినిమాలో చూపించారు. టీవీలో ప్రీమియర్ అయిన ఈ సినిమాను ఇప్పుడు ఆహా తమిళం ఓటీటీ వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 20) నుంచి స్ట్రీమింగ్ చేయబోతుండటం విశేషం.
Best Web Hosting Provider In India 2024
Source / Credits