

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.11-8-2022(గురువారం) ..
నియోజకవర్గ స్థాయిలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఉన్నత చదువులు చదువుకునే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ గా జగనన్న విద్యా దీవెన పథకం ..
నందిగామ నియోజకవర్గంలో జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.2.83 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ ..
నందిగామ పట్టణంలోని ఎం.ఆర్.ఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి జగనన్న విద్య దీవెన పథకాన్ని శాసన మండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రారంభించారు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలనే సమున్నత లక్ష్యంతో ఐటీఐ ,పాలిటెక్నిక్, డిగ్రీ , ఇంజనీరింగ్, మెడిసిన్ ,తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జగనన్న ప్రభుత్వం జమ చేస్తుంది , ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతియేటా రెండు వాయిదాల్లో ఐటిఐ విద్యార్థులకు రూ.10 వేలు , పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు , డిగ్రీ -ఇంజనీరింగ్ -మెడిసిన్ చదివే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం .. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంత మందికి … వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాలు లో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు ,అధ్యాపకులు ,యాజమాన్యాలు పాల్గొన్నారు ..