AP Paddy Procurement : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, మద్దతు ధర రూ.2300గా నిర్ణయం

Best Web Hosting Provider In India 2024


AP Paddy Procurement : ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ-పంట, ఈ కేవైసీ సమాచారంతో రైతులు, కౌలు రైతుల ధాన్యం కొనుగోళ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ధాన్యం కొనుగోలు తర్వాత ఆధార్ అనుసంధానమైన ఈ-పంట , ఈ-కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్ర స్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్ ఫెడ్ సంస్థలు నోడల్ ఏజెన్సీలుగా పనిచేస్తాయని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ధాన్యం కొనుగోలు చేసే రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వరికి నిర్దేశించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ కు రూ.2300, గ్రేడ్ ఏ రకం క్వింటాల్ కు రూ.2320 చెల్లించాలని వెల్లడించింది. ఈ ఖరీఫ్ సీజన్ లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ఆపరేషన్ల పర్యవేక్షణనను జిల్లా కలెక్టర్లు, జేసీలను అప్పగించింది.

సంబంధిత కథనం

టాపిక్

Paddy ProcurementAp GovtAndhra Pradesh NewsTrending ApTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024