Best Web Hosting Provider In India 2024

బాపట్ల: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా నిజాంపట్నం చేరుకున్నారు. వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా పథకం సాయం విడుదల చేసేందుకు నిజాంపట్నం చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైయస్ఆర్ సీపీ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నిజాంపట్నంలో సీఎం వైయస్ జగన్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. నిజాంపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్.. ఆక్వా పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మత్స్యకారులతో గ్రూప్ ఫొటో దిగి వారితో ముచ్చటించారు. మరికాసేపట్లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని జమచేయనున్నారు.