Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి ఆర్కే రోజా
తిరుపతి: చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు భక్తి లేదు.. బూట్లతో.. చెప్పులతో దేవుడిని మొక్కుతాడు, పూజలు చేస్తాడని మాజీ మంత్రి ఆర్కే రోజావిమర్శించారు.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబుకు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేశాడు… అయినా బుద్ది రాలేదని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందంటూ చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారని విమర్శించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీనిని నమ్నరు.. కానీ, ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు .
సినిమాల్లో ఒక్కో గెటప్.. ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కల్యాణ్ అంటూ.. డిప్యూటీ సీఎం పవన్ పై సెటైర్లు వేశారు.. పాపం పవన్ కల్యాణ్‌కి ఏమి తెలియదు.. ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడమే ఆయన పని.. ట్యాంకర్లు వచ్చింది, శాంపుల్ తీసుకుంది, ల్యాబ్ కు పంపింది, రిపోర్టు వచ్చింది అన్నీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే అన్నారు..
వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుట్రకు తేరలేపారని ఆరోపించారు రోజా.. సీఎం చంద్రబాబు నాయుడుకి తప్పు చేశామని తెలిసే సైడ్ అయ్యారు.. పవన్ కల్యాణ్‌ను ముందర పెట్టి డ్రామాలాడిస్తున్నాడు.. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు భక్తి లేదు.. బూట్లతో.. చెప్పులతో దేవుడిని మొక్కుతాడు, పూజలు చేస్తాడని విమర్శించారు.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబుకు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేశాడు… అయినా బుద్ది రాలేదని మండిపడ్డారు. ఇప్పుడు.. వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడు చంద్రబాబు.. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు.. ఒక దొంగ రిపోర్టును తీసుకొని వచ్చి జంతువుల కొవ్వు కలసిందని అబద్ధం చెప్పారు.. రిపోర్టును టీడీపీ ఆఫీసులో ఎందుకు బయటపెట్టారు.. ఎలా వచ్చింది..? అని నిలదీశారు..
లడ్డూ వివాదంపై సీబీఐ విచారణను మేం అడిగాం… కానీ, చంద్రబాబు ప్రెస్‌మీట్‌లు పెడుతూ డ్రామాలాడుతున్నాడు అని మండిపడ్డారు రోజా.. ఇప్పటివరకు కుల రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశాడు… ఇప్పుడు మత రాజకీయాలు ప్రారంభించారన్న ఆమె.. పవన్ కల్యాణ్ వాళ్ల నాన్న, అన్న అందరూ దేవుడు లేడంటూ దారుణంగా మాట్లాడారు.. నా భార్య క్రిస్టియన్ అని చెప్పాడు.. ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు అని దుయ్యబట్టారు.. చంద్రబాబు సీఎం అవ్వడానికి అబద్ధపు హామీలు ఇచ్చాడు.. ఈవీఎంలను మేనేజ్ చేసి ఎలా గెలిచాడో అందరికీ తెలసున్నారు.. ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీ ఏ ఒకటి నెరవేర్చలేదు.. వరదల్లో ప్రజలుంటే కనీసం వారికి నీళ్లు, చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి.. వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి లడ్డూ వివాదాన్ని తెరపైకి చంద్రబాబు తెచ్చాడు.. దేవుడి మీద భక్తి.. భయం ఉంటే సీఎం, డిప్యూటీ సీఎం మొదట విచారణ జరపాలి.. తప్పు చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.. అలా కాకుండా వాళ్ల వంద రోజుల సమావేశంలో ఒక అబద్ధపు ప్రచారాన్ని లడ్డూపై చంద్రబాబు మాట్లాడాడు. దానికోసం ఒక ఫేక్ రిపోర్టును బయటకు తీసుకోవచ్చారు అంటూ తీవ్రస్థాయిలో మాజీ మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు .