సీఎం చంద్రబాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

Best Web Hosting Provider In India 2024

తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టులో విచార‌ణ‌

ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు? 

సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు? 

కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..? 

కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?

న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించింది.  
ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు.

‘‘లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. కల్తీ జరిగిన వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, బోర్డునే నిర్వహిస్తారు. ఈవో ను ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది’’ సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

చంద్రబాబు వైఖరిపై సుప్రీం కోర్టు సీరియస్‌
ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?.ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు. మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. జులైలో రిపోర్ట్‌ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు? సిట్ ఎందుకు వేశారు? అంటూ సీఎం చంద్రబాబు బాబు వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు. నెయ్యి రిజెక్ట్‌ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా? ధర్మాసనం ప్రశ్నించింది.

కాగా, తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు.

ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదికపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్‌ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్‌లో విన్నవించారు.

ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్‌ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.

నిరాధారమైన త­ప్పు­డు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనో­భా­వాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్‌వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆ­ధారంగా చేసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నా­రు. అందుకే సుప్రీం­కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్థించారు.

Best Web Hosting Provider In India 2024