Best Web Hosting Provider In India 2024
01 Oct 2024 2:52 PM
వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అజ్ఞాని అంటూ వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు వంటి వెన్నుపోటుదాడులు రాజకీయ లబ్ధి కోసం దేవుడిని, మతాన్ని వాడుకుంటారన్నిఘాటు విమర్శలు చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..
‘హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం.. ఈ రెండు వేరు వేరు. నిజమైన హిందువు.. దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు. రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు, దేవుడినీ, మతాన్ని వాడుకుంటారు’ అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.